KCR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నిత్యం కెసిఆర్ చుట్టూ తిరుగుతుంటాయి. అది వివాదం కావచ్చు.. నినాదం కావచ్చు.. ఎన్నిక కావచ్చు.. ఓటమి కావచ్చు. కెసిఆర్ ప్రస్తావన లేకుండా.. కెసిఆర్ పేరు లేకుండా తెలంగాణ రాజకీయాలు ఇప్పట్లో సాగే పరిస్థితి లేదు. భవిష్యత్ కాలంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కెసిఆర్ సాజంగానే భారీతనాన్ని ఇష్టపడతారు. అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎన్వీ రమణ. ఆయన […]
కేసీఆర్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నిత్యం కెసిఆర్ చుట్టూ తిరుగుతుంటాయి. అది వివాదం కావచ్చు.. నినాదం కావచ్చు.. ఎన్నిక కావచ్చు.. ఓటమి కావచ్చు. కెసిఆర్ ప్రస్తావన లేకుండా.. కెసిఆర్ పేరు లేకుండా తెలంగాణ రాజకీయాలు ఇప్పట్లో సాగే పరిస్థితి లేదు. భవిష్యత్ కాలంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
కెసిఆర్ సాజంగానే భారీతనాన్ని ఇష్టపడతారు. అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎన్వీ రమణ. ఆయన ఏం చేసినా సరే అలానే ఉంటుందని తెలుస్తుంది. ఆయన మాటలకు తగ్గట్టుగానే కేసీఆర్ ఏం చేసినా సరే అలానే ఉంటుంది. అయితే కొన్ని విషయాలు మాత్రం చేసిన భారీతనమే ఆయనకు ఇబ్బందిగా మారింది. కెసిఆర్ ఇలా చేస్తారని.. ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటారని గులాబీ పార్టీ నాయకులు కలలో కూడా ఊహించి ఉండరు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు నిర్మించారు. ఇందులో కేసీఆర్ పాత్రే గజ్వేల్ కూడా ఒకటి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మించి దాదాపు తొమ్మిది సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఒక్కసారి కూడా అందులోకి ఆయన ప్రవేశించలేదు. కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొనలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న క్యాంప్ ఆఫీస్లోకి కెసిఆర్ ఎందుకు వెళ్లలేదనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. వాస్తును విపరీతంగా నమ్మే కెసిఆర్ ఇలా చేయడం ఏంటో అర్థం కావడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం ఉంది. ఒకప్పుడు మాత్రం కేసీఆరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు.. పైగా ఆయన గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటప్పుడు క్యాంప్ ఆఫీస్ లో ఉండడానికి ఇబ్బంది ఏముందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టి ప్రగతి భవన్ నిర్మించారు. ఆయన తక్కువసార్లు ప్రగతి భవన్ లో ఉన్నట్టు మాత్రమే. ఆయన అప్పుడప్పుడు మాత్రమే అందులో ఉండేవారు. ఎక్కువసార్లు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాత్రమే ఉండేవారు. అది కూడా గజ్వేల్ చాలా దగ్గర. అయితే ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు హాజరు కాలేదు. పాత సెక్రటేరియట్లో బ్రహ్మాండమైన భవనాలు. నూతన సచివాలయం నిర్మించారు. దానికోసం భారీగా ఖర్చు పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సెక్రటేరియట్ కూడా ఆయన ఎక్కువసార్లు రాలేదని కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. ఇప్పుడు గజ్వేల్ కి ఎమ్మెల్యేగా కనిపించడం లేదు.. ఆయన క్యాంప్ ఆఫీస్ కు రావడం లేదు.. ప్రజలను నేరుగా కలవడం లేదు. ఆయనకు అవసరమనుకుంటే తప్ప ప్రజలను కలవరని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు గజ్వేల్ లో కట్టిన MLA క్యాంపు ఆఫీస్. కట్టిన తర్వాత 8 సంవత్సరాలలో ఒక్కసారి కూడా దీన్ని వాడలేదు. మరి ఎందుకు కట్టినట్లు ? డబ్బులు వెస్ట్ చేయడంలో ఈయన మొనగాడు.
ఈయన గారు హైదరాబాద్ లో సిగ్గులేకుండా 350 కోట్లు ఖర్చుపెట్టి… pic.twitter.com/2lASGYMXip— మురళి ఆకునూరి (@Murali_IASretd) సెప్టెంబర్ 25, 2026
