Home Latest News స్థానిక ఎన్నికల వేళ: పుంగనూరు రాయచోటిలో ఉద్రిక్తతలు.. రాళ్లదాదులు, వాహనాల దగ్ధం.! | పుంగనూరు రాళ్ల దాడి | మిథున్ రెడ్డి | వాహనం దాడి | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | వైసీపీ | టీడీపీ ఘర్షణ – Andhra Waves

స్థానిక ఎన్నికల వేళ: పుంగనూరు రాయచోటిలో ఉద్రిక్తతలు.. రాళ్లదాదులు, వాహనాల దగ్ధం.! | పుంగనూరు రాళ్ల దాడి | మిథున్ రెడ్డి | వాహనం దాడి | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | వైసీపీ | టీడీపీ ఘర్షణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


స్థానిక ఎన్నికల వేళ ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. స్థానిక రాజకీయ పరిణామాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు శాంతిభద్రతల సమస్యగా మారుతున్నాయి.

తాజాగా పుంగనూరులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై రాళ్లదాడి జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి తలపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో పరిస్థితి వేడెక్కింది. ఒక దశలో ఇరు వర్గాలను అదుపు చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా రాయచోటిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయచోటిలో ఆందోళనకారులు కొన్ని వాహనాలకు నిప్పంటించారు.

రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల కోసం వెళుతుండగా టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకుని రాడ్లు, కర్రలతో దాడి చేశాయని వైసీపీ ఆరోపించింది. ఇది ముందస్తు ప్రణాళికతో హత్యా ప్రయత్నమని, పోలీసులు సరైన రక్షణ కల్పించలేదని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఇంకోవైపు ఎన్నికల వాతావరణాన్ని కావాలంటే రెచ్చగొడుతూ వైసీపీ ఘర్షణలకు దిగిందని టీడీపీ వర్గీయులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర దాడులు, వాహనాల దహనంతో పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి తగ్గుముఖం పట్టడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాయచోటి, పుంగనూరుతో పాటు తిరుపతిలో కూడా నామినేషన్ కేంద్రం దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజం కూటమి పక్షాలు ఆందోళన చేశాయి.


[Punganur Stone Pelting, Mithun Reddy, Vehicle Attack,   Andhra Pradesh Politics, YCP, TDP Clash, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird