దిశా సాలియన్: ఓ అమ్మాయి చనిపోయింది. అది కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ కేసులో ఆశ్చర్యకరంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ఆయన కొడుకు.. ఓ మాజీ మంత్రి.. మాజీ హోం మంత్రి.. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఎవరా అమ్మాయి.. ఏమిటి ఆ కథ.. చాలా డీటెయిల్ గా ఇందులోకి వెళ్దాం..
బాల్ థాకరే కుటుంబం ఎలా అయిపోయింది
ముంబై పేరు చెప్తే చాలామందికి దేశ ఆర్థిక రాజధాని గుర్తుకొస్తుంది. ముంబై నగరంలో శివసేన పేరు చెబితే హిందువులకు రక్తం మరుగుతుంది.. అలా మరగడానికి కారణమైన ఆ వ్యక్తి పేరు బాల్ థాకరే. ఆయనను మహారాష్ట్ర పులి మాదిరిగా కనిపిస్తోంది. ఆయన బతికి ఉన్నప్పుడు ముంబైగడ్డ మీద ఇమేజ్ ఒక రేంజ్ లో ఉండేది. ప్యూర్ మాస్ లీడర్.. తన పత్రిక సామ్నాలో రాసే వాక్యాలు నిప్పు కణికల లాగా ఉండేవి. ఒక రకంగా బాల్ థాకరే ను నేటి కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టిన మరాఠా యోధుడు శివాజీ అని చాలామంది కొనియాడేవారు. దేశ ప్రధానులను.. ముఖ్యమంత్రులను తన నివాసానికి పిలిపించుకున్న ఘనత బాల్ థాకరే ది. అటువంటి బాల్ థాకరే కడుపులో పుట్టిన వ్యక్తి పేరు ఉద్ధవ్ థాకరే. కానీ తండ్రి లాగా ఇతను పులి కాదు. పూర్తిగా పిరికి క్యారెక్టర్. పైగా అసమర్థుడు. మోసం.. ఆశావాదాన్ని నింపుకున్న వ్యక్తి. ఇక ఈయన కుమారుడు ఆదిత్య అయితే మరింత దిగజారుడు వ్యక్తిత్వం ఉన్న వాడు. చివరికి ఒక అమ్మాయి పై జరిగిన దారుణంలో ఇతడు పూర్తిగా కూరుకుపోయాడు.
అనుమానాస్పద స్థితిలో చనిపోయింది
మహారాష్ట్రలో దిశా సాలియన్ అనే ఒక అమ్మాయి అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈమె బాలీవుడ్ లో సినిమా తారలతో కలిసి టాలెంట్ మేనేజర్ గా పని చేసింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు కొద్దిరోజుల పాటు మేనేజర్ గా పనిచేసింది. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం జూన్ 8 మలాడ్ అనే ప్రాంతంలో ఎత్తైన భవనం నుంచి దూకి చనిపోయింది . ఈమె చనిపోయిన ఆరు రోజులకే జూన్ 14న సుశాంత్ సింగ్ బాంద్రా ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశాడు. బాలీవుడ్ సినిమా రంగానికి చెందిన వీరిద్దరూ కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే చనిపోవడం అనేక అనుమానాలకు కారణమైంది. వాస్తవానికి అయితే ఈ మరణాల కథ ఇక్కడితోనే ఆగిపోవాలి. అయితే సరిగ్గా ఆరు సంవత్సరాల తర్వాత ఈ మరణాల మీద అలజడి మొదలైంది. సిబిఐ రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇంతకీ దిశ ఎవరు
చనిపోయే సమయం నాటికి దిశ వయసు 28 సంవత్సరాలు. బాలీవుడ్ లో టాలెంట్ మేనేజర్ గా పని చేస్తున్న ఈమెకు సినిమా పరిశ్రమలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. సుశాంత్ తో కూడా ఈమె కలిసి పనిచేయడం విశేషం. దిశచనిపోయినప్పుడు దీనిని పోలీసులు ప్రమాదకరమైన మరణంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలైంది. దిశ ఆత్మహత్య చేసుకునేందుకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే తన కూతురు చనిపోయేంత పిరికిది కాదని దిశ తండ్రి సతీష్ సాలియన్ అభిప్రాయం. తనపై ఆత్మహత్య చేసుకుందనే ఆయన అస్సలు ఒప్పుకోలేదు..” అంటూ నా కూతురు పిరికిది కాదు.
రాజకీయాలలో పేలుడు పదార్ధంగా
ఇక ఈ కేసులో ఆదిత్య ఠాక్రే.. డీనో మోరియా.. సూరజ్ పంచోలి.. రియావర్తి.. ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్.. సచిన్ వాజే వంటి వారి పేర్లు ఇందులో నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసు క్రమేపీ పొలిటికల్ రంగు పూసుకుంది.. ఆదిత్య ఠాక్రే మామూలు వ్యక్తి కాదు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. అయితే తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్లో వీరిద్దరి ఉద్దవ్, ఆదిత్య పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు మరింత లోతుగా తవ్వితే ఉద్ధవ్ పాత్ర బయటపడుతుంది. కాకపోతే ఇప్పటికే ఈ కేసు మహారాష్ట్రలో కీలకంగా మారింది.. ఒకరకంగా అక్కడి రాజకీయాలలో పేలుడు పదార్ధంగా రూపొందించబడింది.
ఆ విషయాలు దిశకు తెలుసా
ముంబై మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆదిత్యకు సంబంధించిన కొన్ని విషయాలు దిశకు తెలిసిన సమాచారం. వాటికి సంబంధించిన ఆధారాలను ఆమె సుశాంత్ కు ఇచ్చిందని. మన వైపు ఇదే దిశ తండ్రి తరపున న్యాయవాదిగా వాదిస్తున్న నీలేష్ చెబుతున్నారు . ..” దిశ దగ్గర ఉన్న సమాచారం కొంతమందికి చేరిందని ఆ తర్వాత దిశ చనిపోయింది. సరిగ్గా ఆరు రోజుల తర్వాత సుశాంత్ కూడా కన్నుమూశాడు. చెబుతున్నాడు.
ఆరు రోజుల వ్యవధిలో..
జూన్ 8న దిశ చనిపోయింది. సుశాంత్ జూన్ 14న కన్నుమూశాడు. ఆరు రోజుల వ్యవధిలో ఇద్దరు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు చనిపోవడం నిజంగా సంచలనంగా మారింది. అయితే మొదట ముంబై పోలీసులు ఈ రెండు మరణాల మధ్య ఏమీ లేదని తేలింది. ఆ తర్వాత సుశాంత్ కేసులో సిబిఐ ఎంట్రీ అయింది. దర్యాప్తు మొదలుపెట్టింది. 2025 మార్చి వరకు ఈ కేసులో ఎటువంటి అనుమానించే విషయం లేదని సిబిఐ న్యాయస్థానానికి క్లోజ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ దిశ కేసులో సుశాంత్ పేరు వినిపించడం ఒకవిధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే సరిగా ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఈ కేసు తెరపైకి వచ్చింది. మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏదైనా కుట్ర జరిగిందా..
ఈ కేసులో తన కుమారుడిని కాపాడడానికి.. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఏమైనా కుట్ర చేశారా.. ఆధారాలను మాయం చేశారా.. దర్యాప్తును ప్రభావితం చేశారా.. అనే సీబీఐ విచారణకు అవకాశం ఉంది.. అయితే బాంబే కోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక యువతి చనిపోవడాన్ని పక్కన పెడితే.. ఆమె మరణం తర్వాత ఇంత జరిగిందా.. అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.. ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం కలవరపరుస్తోందని వ్యాఖ్యానించింది. ఆధారాలను సంపాదించలేదు..ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదనే దానిపై కోర్టు ప్రశ్నలు వ్యక్తం చేసింది. అందుకే ఈ కేసును మళ్ళీ సిబిఐ కి అప్పగిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడేం జరుగుతుంది..
సాధారణంగా ముంబైలో బాలీవుడ్ అంటేనే రకరకాల శక్తులు ఉంటాయి. మాఫియాలు.. ఇతర అసాంఘిక శక్తులు.. నేరసామ్రాజ్యం.. రాజకీయ నాయకులు.. వారంతా కలిసిపోయి ఒకే రకమైన వ్యవస్థను కొనసాగిస్తారు. ఇలాంటి పంకిలంలోకి ఏకంగా మాజీ సీఎం.. ఆయన కుమారుడు.. మాజీ హోంమంత్రి.. పోలీస్ కమిషనర్ పేర్లు రావడం.. నిజంగానే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే సిబిఐ ఈ స్టోరీకి జస్టిఫికేషన్ ఇస్తుందా.. అనేది చూడాలి. కానీ ముంబై కోర్ట్ ఈపెట్టె అంత సులువుగా వదిలివేయడం కనిపించలేదు. ఈ మొత్తం స్టోరీలో అసలైన దారుణం ఏంటంటే.. తాను బతికి ఉన్నప్పుడు ముంబైలో మాఫియా మీద ఉక్కు పాదం మోపి తిరుగులేని మరాఠయోధుడు లాగా పేరు తెచ్చుకున్నాడు బాల్ ఠాకరే. కానీ ఆయన మనవడు ఇప్పుడు అదే మాఫియా తో అంట కాగిన కేసులో ఇరుక్కున్నాడు. ఇంతకంటే దారుణం.. ఘోరం శివసేనకు మరొకటి ఉండదు.
