Home సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ గ్రౌండ్ లో క్లౌడ్ ఇంతే.. హైదరాబాద్ లో జరిపి ఉంటే! – Andhra Waves

ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ గ్రౌండ్ లో క్లౌడ్ ఇంతే.. హైదరాబాద్ లో జరిపి ఉంటే! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది'(Peddi). 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, క్రీడల ద్వారా ఒక సామాన్యుడు తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి.

ఈ మెగా వేడుకకి అభిమానులతో పాటు అశేష జనవాహిని తరలివచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుండే విజయవాడ నగర వీధులన్నీ మెగా అభిమానుల నినాదాలతో మారుమోగిపోయాయి. స్టేడియం సామర్థ్యానికి మించి వేలాది మంది అభిమానులు తరలిరావడంతో బెజవాడలో ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. ఇతర జిల్లాల నుండి దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఈ చరిత్రాత్మక క్షణాన్ని కళ్లారా చూసేందుకు విజయవాడకి చేరుకోవడం ఈ ఈవెంట్‌ని చూపుతోంది. ఈవెంట్ ప్రారంభమైన కాసేపటికే స్టేడియం లోపల ఉన్న గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. దీంతో చరణ్ తన స్టామినా ఏ పాటిదో మరో సారి చాటి చెప్పింది.

ఇది కూడా చదవండి: ధురంధర్: ధురంధర్ పై దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఆగ్రహం..ముంబైలో భారీ ఉగ్రకుట్రకి ప్లాన్

ఆ పబ్లిక్ ని చూసిన తర్వాత హైదరాబాద్ లో రెగ్యులర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అయితే సరిపోయేది కాదని సినీ పరిశీలకులు అంటున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ తో పాటు మిగిలిన నటీనటులు, దర్శకుడు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird