Home Latest News డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక లావాదేవీలపై దుమారం.. అమెరికా రాజకీయాల్లో నైతిక సంక్షోభం! | డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక లావాదేవీలపై కలకలం | డోనాల్డ్ ట్రంప్ | అవినీతి | ఆరోపణలు | USPolitics | InsiderTradingControversy | క్రిప్టో రెగ్యులేషన్స్ రిలాక్సేషన్ – Andhra Waves

డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక లావాదేవీలపై దుమారం.. అమెరికా రాజకీయాల్లో నైతిక సంక్షోభం! | డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక లావాదేవీలపై కలకలం | డోనాల్డ్ ట్రంప్ | అవినీతి | ఆరోపణలు | USPolitics | InsiderTradingControversy | క్రిప్టో రెగ్యులేషన్స్ రిలాక్సేషన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన విమర్శల వలయంలో చిక్కుకున్నారు. ఆయన వైట్ హౌస్ అధికారాలను ఉపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, భారీ ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగత వ్యాపారం ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం వల్ల అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు కేవలం పరిపాలనా లోపాలను మాత్రమే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పణంగా పెడుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే ట్రంప్ అసాధారణ రీతిలో వేల సంఖ్యలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు వెల్లడైంది. లెక్కింపు ప్రకారం ఆయన రోజువారీగా మరియు గంటల వ్యవధిలో జరిపిన ట్రేడింగ్ పరిమాణం అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన నైతిక నియమావళిని ఉల్లంఘించేలా విమర్శకులు గొంతెత్తుతున్నారు.

గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అధికారంలో ఉంటూ ఇంతటి క్రియాశీలక ఆర్థిక కార్యకలాపాల్లో అత్యంత పాల్గొనలేదనీ.. ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరలేపుతోందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చట్టాల ప్రకారం కాకుండా, నైతిక విలువలకు ఈ చర్యలు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆర్థిక లావాదేవీల్లో ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఇంటెల్, డెల్ వంటి కంపెనీల షేర్లు ఈ వివాదాన్ని మరింత క్లియర్‌గా మార్చాయి. రక్షణ శాఖకు సంబంధించిన కీలక ఒప్పందాల ప్రకటనలు వెలువడటానికి ముందే ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వెనుక సైడర్ ట్రేడింగ్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

ముఖ్యంగా చైనాకు కృత్రిమ మేధస్సు (ఏఐఐ) చిప్‌ల సరఫరాకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు వచ్చే లోపే ఎన్విడియా షేర్లను కొనుగోలు చేయడం, అలాగే డెల్ సంస్థను బహిరంగంగా ప్రశంసించడానికి కొద్ది రోజుల ముందే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం అధికారిక ఫలితాలు వ్యక్తిగత లాభాల కోసమే అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు, న్యాయ శాఖ పరిధిలో ఒక భారీ నిధుల పంపిణీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన వారి సహాయార్థం ఉద్దేశించిన ఈ నిధులు.. ప్రస్తుతం ట్రంప్ రాజకీయ మిత్రులకు, జనవరి 6 నాటి క్యాపిటల్ హిల్స్ ఘటనతో సంబంధం ఉన్న అనుచరులకు చేరేలా వ్యూహాత్మకంగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధుల కేటాయింపులపై సాధారణ న్యాయస్థానాల పర్యవేక్షణ, సమీక్షలను పరిమితం చేయడం వల్ల పారదర్శకత పూర్తిగా లోపించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనం ఏ ప్రాతిపదికన పంపిణీ అవుతోందో స్పష్టమైన సమాధానాలు లేకపోవడం ఈ రాజకీయ వివాదాన్ని మరింత పెద్దది చేస్తోంది. గతంలో క్యాపిటల్ హిల్ ముట్టడి కేసుల్లో నిందితులుగా ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్షలు ప్రసాదించడం అమెరికా అంతటా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వారికి ప్రభుత్వ రక్షణ కల్పించడమే కాకుండా.. ఆర్థిక రూపంలో కూడా కల్పిస్తున్నారనే వార్తలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఒక దేశాధినేత తనకు అనుకూలంగా ఉన్న వర్గాలను శిక్షల నుండి కాపాడుతుంది. ఇది కాంగ్రెస్ పర్యవేక్షక అధికారాలను, న్యాయవ్యవస్థ స్వతంత్రతను సవాలు చేసేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే కాకుండా.. ట్రంప్ కుటుంబ సభ్యులకు డిజిటల్ కరెన్సీ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. అంతర్లీనంగా అధ్యక్షుడి కుటుంబ వ్యాపార ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలను తోసిపుచ్చలేమని నిపుణుల మార్కెట్. ప్రభుత్వ విధానాల రూపకల్పన స్వంత లాభాల కోసం వాడటం వల్ల కాలక్రమేణా ప్రభుత్వ సంస్థల పట్ల, పాలకుల పట్ల సామాన్య ప్రజలలో నమ్మకం పూర్తిగా సడలిపోయే ప్రమాదం ఉంది.

ఈ పరిణామాలు అమెరికా రాజకీయ చరిత్రలో ఒక అసాధారణ నైతిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. గతంలోనూ అనేక మంది నాయకులు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. ఒకే సమయంలో క్రియాశీల ట్రేడింగ్, కీలక ప్రభుత్వ నిర్ణయాలు, మిత్రులకు పంపిణీ, నియంత్రణల సడలింపు వంటివన్నీ ఒకే దారిలో సాగడం ఇదే మొదటిసారి. ఈ ఆరోపణలు కేవలం ఒక వ్యక్తిగత వైఫల్యంగా కాకుండా.. మొత్తం ప్రభుత్వ పాలనా సంస్కృతినే కలుషితం చేసే విధంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ వివాదాలు కేవలం తాత్కాలిక రాజకీయ విమర్శలుగా మిగిలిపోయేలా కనిపించడం లేదు. ఇవి ప్రజాధన దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రభావం, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి వంటి ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలను ప్రశ్నిస్తున్నాయి. ఈ ఆరోపణలు భవిష్యత్తులో న్యాయస్థానాలలో నిలబడతాయా లేదా అన్నది పక్కన పెడితే.. అమెరికా సమాజంలో, అంతర్జాతీయ వేదికపై ఆ దేశ రాజకీయ నైతికతపై ఇప్పటికే ఒక పెద్ద నల్లటి మచ్చను మిగిల్చాయని చెప్పక తప్పదు. దర్యాప్తు సంస్థల తదుపరి చర్యలు, కాంగ్రెస్ స్పందనపైనే ఈ సంక్షోభం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird