Home సినిమా టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్.. – Andhra Waves

టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్.. – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


1. ఒకే ఫ్రేమ్‌లో ‘మెగా బ్రదర్స్’..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ మూవీ లాంచ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చాలాకాలం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు.. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్‌లో నవ్వుతూ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

2. ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ!
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రేజీ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం 3’ థియేటర్లలోకి వచ్చి డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అక్కడక్కడా కొన్ని టెన్షన్ సీన్స్‌తో సినిమా మూడ్‌ను బిల్డ్ చేయడంలో సక్సెస్ అయినప్పటికీ.. ఓవరాల్‌గా కథనం ఫ్లాట్‌గా, చాలా సాధారణంగా సాగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ కొంతవరకు పర్వాలేదనిపించినా.. మిగిలిన సినిమా అంతా సాగతీతగా, రొటీన్‌గా అనిపిస్తుందని నెటిజన్లు పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు.

3. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ సరికొత్త రికార్డులతో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్, లైక్స్‌తో సరికొత్త రికార్డులను సృష్టించింది. 64 మిలియన్లకు పైగా వ్యూస్ తో.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్‌గా ‘డ్రాగన్’ విజయం సాధించింది.

4. ‘స్పిరిట్’ క్రేజీ అప్‌డేట్!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ సరికొత్త షెడ్యూల్ మే 23 నుంచి ప్రారంభం. ఈ క్రేజీ షెడ్యూల్‌లో హీరో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో, త్రిప్తి డిమ్రి కాంబినేషన్‌లో కొన్ని కీలకమైన సీన్‌లను మేకర్స్ చిత్రీకరించిన చిత్రాలను వచ్చేలోపే.

5. ‘ఉప్పెన’ కంటే 100 రెట్లు షాకింగ్ ట్విస్ట్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ సినిమాపై ఒక సంచలన లీక్ ఇచ్చారు. ఈ అయితే “ఢిల్లీ ఎపిసోడ్” తనకు అత్యంత ఇష్టమైన భాగమని, అక్కడే కథను మలుపు తిప్పే అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుందని చరణ్ తెలిపాడు. అంతేకాదు, బుచ్చిబాబు మొదటి సినిమా ‘ఉప్పెన’ క్లైమాక్స్ ట్విస్ట్ కంటే ఈ ట్విస్ట్ 100 రెట్లు ఎక్కువ షాకింగ్‌గా, ఊహకందని విధంగా ఉంటుందని చరణ్ చెప్పారు.

6. ‘వారణాసి’ సాంగ్ కోసం స్పెషల్ సెట్!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సరికొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కాటేదాన్ (Katedan) ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబుపై చిత్రీకరిస్తున్న ఈ క్రేజీ సాంగ్ మేకర్స్ అక్కడ ఒక ప్రత్యేకమైన సెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

7. రియల్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని!
ఎలాంటి హంగు ఆర్భాటాలు, మీడియా హడావుడి లేకుండా రామ్ పోతినేని నేరుగా ఓ వీరాభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 18 ఏళ్లుగా ‘ఫ్రెడ్రిచ్ అటాక్సియా’ అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఓ యువతి.. తనను ఒక్కసారైనా చూడాలని కోరుకుంటున్న విషయం తెలిసిన రామ్ వెంటనే స్పందించారు. ఎలాంటి ప్రచారం ఆశించకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, ఆమె పక్కనే ఉండి ఆప్యాయంగా పలకరించి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.

8. అప్పుడే ఓటీటీలోకి ‘వీరభద్రుడు’
రీసెంట్‌గా రిలీజై బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూర్య లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ. 35 కోట్ల భారీ ఉన్నట్లు వెచ్చించినట్లు. సాధారణంగా ఉండే నాలుగు వారాల విండో రూల్ ప్రకారం ఈ చిత్రం జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

9. ‘కుర్చీ తాత’ కన్నుమూత!
‘కుర్చీ మడతపెట్టి’ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. తీవ్ర వడదెబ్బ కారణంగా ఆయన కన్నుమూసినట్లు సమాచారం.

10. SRH ఓనర్ తో అనిరుధ్ పెళ్లి?
స్టార్ మ్యూజిక్ అని డైరెక్టర్రుధ్, సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో మళ్లీ వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ రూమర్స్‌పై అనిరుధ్ సూచన.. ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు ట్రెండ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird