ఓ మామ తన అల్లుడికి వెండి చెప్పులు కానుకగా ఇచ్చారు. ఇందు కోసం ఆయన ఏకంగా నాలుగు లక్షల రూపాయలకు పైగా వెచ్చించాడు. దాదాపు కిలోన్నర వెండితో కొల్హాపురి చెప్పులను తయారు చేసి మరీ తన అల్లుడికి కానుకగా ఇచ్చారు.
కొల్హాపుర్ కు చెందిన ప్రముఖ చర్మకారుడు విక్రాంత్ మాలి దాదాపు ఎనిమిది రోజులు శ్రమించి ఈ ప్రత్యేక చెప్పులను రూపొందించాడు. ప్రస్తుతం వెండి ధరలు ఆకాశన్నంటుతున్న వేళ.. తన అల్లుడి కోసం ప్రత్యేకంగా వెండితో చెప్పులు తయారు చేసి కానుకగా ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
