
మోదీ సర్కార్ వైఫల్యం వల్లే నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది
బీజేపీ నేతలు మాటల గారడి చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
కార్పోరేట్ శక్తులకు కోట్ల రూపాయల ప్రజాధనం ధారాదత్తం చేస్తూ ప్రజలపై భారం మోపుతోంది
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
ముద్ర, కరీంనగర్ :
నాలుగు రోజుల్లో,డీజిల్ పై లీటరుకు నాలుగు రూపాయల చొప్పున భారం వేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం ప్రభుత్వం ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దారదత్తం చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని. ఖాళీ ఖజానా అప్పజెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ధరలు పెంచలేదని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.నీట్ పరీక్షా పత్రానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 26 మంది విద్యార్థులు 70 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. లీక్ పై బీజేపీ నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన లాగే బీజేపీ ప్రభుత్వం కూడా నడుస్తుందని బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్నీ లీక్ లే అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాల భర్తీ చేసిందని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో తాజొద్దీన్,పిట్టల రవీందర్,కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్,గంట శ్రీనివాస్,జగన్ శంపర్వతం నర్సింగరావు బుచ్చిరెడ్డి,టెల భూమయ్య,సరిల్ల ప్రసాద్,బాలరాజు,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,జీడి రమేష్,మ్యాకల నర్సయ్య,బత్తిని చంద్రయ్య,సుదర్శన్,మాసుం ఖాన్,శ్రీధర్ రెడ్డి,షెహెన్షా,భారీ,బషీర్,ఖలీల్,జమీల్,హనీఫ్ సాయిరాం ఉన్నారు.