Home సినిమా సంస్కృత చలనచిత్ర పరిశ్రమకు శ్రీకారం చుట్టిన జనార్థన మహర్షి! – Andhra Waves

సంస్కృత చలనచిత్ర పరిశ్రమకు శ్రీకారం చుట్టిన జనార్థన మహర్షి! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


భారతీయ చలనచిత్ర రంగం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ పరిశ్రమలు. కానీ, వీటన్నింటికీ మూలమైన సంస్కృత భాషలో ఒక పూర్తిస్థాయి సినిమా ఇండస్ట్రీ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచననే నిజం చేస్తూ, ప్రముఖ రచయిత మరియు దర్శకుడు జనార్థన మహర్షి ఒక చరిత్రాత్మక అడుగు వేశారు. భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషా మాధుర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన “సంస్కృత ఫిలిం ఇండస్ట్రీ”ని ప్రారంభిస్తున్నారు.

సంస్కృతం అంటే కేవలం పౌరాణికాలు, శ్లోకాలకే పరిమితం అనే అపోహను తొలగించడమే ఈ ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం. అస‌లు సంస్కృత ఫిలిం ఇండస్ట్రీని స్థాపించిన ఆలోచన ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఇందులో ఎంత మంది భాగ స్వాములుగా చేరబోతున్నారు. జనార్థన మహర్షి మాట్లాడుతూ.. “తెలుగు, తమిళ పరిశ్రమల తరహాలోనే ఇది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ. ఇందులో కేవలం పౌరాణికాలే కాదు, చక్కని సెన్సిబుల్ కథలతో కూడిన కమర్షియల్ సినిమాలు కూడా నిర్మించవచ్చు. ఇప్పటికే నేను ‘భాషావిశ్వదర్శనం’, ‘దేవస్థానం’ వంటి చిత్రాలలో శ్లోకాలను ఆస్వాదించబోతున్నాను.

ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన తర్కాన్ని ఆయన వినిపించారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలైన విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, భగవద్గీత అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైతే, ఆయనతో సంభాషించడానికి సంస్కృతం అవసరమని, అలాగే స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవతలతో మాట్లాడాలన్నా ఈ భాషలో ప్రావీణ్యం ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే ‘జయతు జయతు సంస్కృతం’ అనే కాన్సెప్ట్‌తో ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు.

భారతీయ సంస్కృత చలనచిత్ర సమాఖ్య పేరుతో ప్రారంభిస్తున్న ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మే 16 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో కన్నడ నుంచి రాక్‌లైన్ వెంకటేష్‌తో పాటు తనికెళ్ల భరణి, కె.వి.రమణాచారి వంటి ప్రముఖులు భాగస్వామ్యం కాబోతున్నారు. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా సంస్కృత భాషలో సినిమాలు తీయవచ్చు లేదా దర్శకత్వం వహించవచ్చు. వారికి ఈ పరిశ్రమ పూర్తి సహకారం ఉంటుంది. అంతేకాదు, వారి సినిమాలకు సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్లు, ఫిలిం ఫెస్టివల్‌కు పంపడం, కమర్షియల్ డీల్స్‌లో సహాయం చేయడం వంటి బాధ్యతలను జనార్థన మహర్షి స్వయంగా తీసుకోనున్నారు.

గతంలో వారు జి.వి.అయ్యర్ వంటి సంస్కృతంలో చిత్రాలు తీసారు, ఇప్పుడు జనార్థన మహర్షి ఏకంగా 12 సినిమాలు తీయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. సంస్కృత సినిమా ఒక భాషగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జనార్థన మహర్షి ‘సన్ ఆఫ్ సాన్‌స్క్రిట్’ అనిపించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చారిటీ మరియు ట్రస్ట్ రూపంలో సాగే ఈ ప్రయత్నం భారతీయ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చు. సంస్కృత భాషాభిమానులు, సినీ ప్రియులు ఈ వినూత్న ప్రయత్నానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird