Home Latest News వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ | వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు | తెలంగాణ హైకోర్టు | CBI | వైఎస్ సునీత | వైఎస్ షర్మిల | చార్జిషీట్ దాఖలు | సీఎం చంద్రబాబు | నారాలోకేష్ – Andhra Waves

వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ | వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు | తెలంగాణ హైకోర్టు | CBI | వైఎస్ సునీత | వైఎస్ షర్మిల | చార్జిషీట్ దాఖలు | సీఎం చంద్రబాబు | నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


కడపలో వైసీపీ అభిమానుల సంబరాలు..

పలుచోట్ల మిఠాయిలు పంచుతూ హంగామా..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.

అయితే, ఈ కేసులో సీబీఐ పూర్తి చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఇకపై విచారణకు ఆయన అవసరం లేదని భావించిన హైకోర్టు, గతంలో విధించిన షరతులను తాజాగా విడుదల చేసింది. దీంతో ఆయన ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లభించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం ఆయన అనుచరులు, వైసీపీ అభిమానులు కడపలో సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.

వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్ల పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. ఘటన జరిగిన తర్వాత పరిశీలించిన పోలీసులు ఇది సహజ మరణం కాదనీ, హత్యని తెలియజేసారు.15వ తేదీ సాయంత్రం పోస్ట్‌మార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయనీ, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలు ఉన్నాయని తేలింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird