సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కడుపునొప్పితో గురువారం (ఏప్రిల్ 15) రాత్రి ఆసుపత్రికి వెళ్లారు. అత్యవసరంగా నిర్వహించిన వైద్యులు, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియోటర్ కువెళ్లారు. అయితే ఆమె ఆపరేషన్ టేబుల్ పైనే కన్ను మూశారు. వివరాలిలా ఉన్నాయి.
హారిక అనే యువతి కడుపునొప్పితో బాధపడుతుండటంతో అమీన్ పూర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఓకే అన్నారు. నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించారని వైద్యులు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులు సాధారణ కడుపు నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆపరేషన్ అంటూ ప్రాణాలు తీశారనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదుట ఆందోళనకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే హారిక మరణించిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.
.webp)