Home Latest News జీవన్ రెడ్డి ఆ దుర్మార్గుడితో జతకట్టాడు : సీఎం రేవంత్ రెడ్డి | జగిత్యాలలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం | జీవన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | మున్సిపల్ ఎన్నికలు | కేసీఆర్ | కేటీఆర్ – Andhra Waves

జీవన్ రెడ్డి ఆ దుర్మార్గుడితో జతకట్టాడు : సీఎం రేవంత్ రెడ్డి | జగిత్యాలలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం | జీవన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | మున్సిపల్ ఎన్నికలు | కేసీఆర్ | కేటీఆర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


జగిత్యాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడటం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పంచుకోవాలనే ఉద్దేశ్యంతో మీతో ఈ సమావేశం నిర్వహించానని చెప్పారు.మేము ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా చేసినట్లు లేదు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మనమంతా కృషి చేశాం. పార్లమెంట్ ఆయన్ని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం.

అయితే ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనే అభ్యర్థన మేరకు పార్టీ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించాం. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా ఆయన వినలేదు. మొండి పట్టుదలతో జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 40 ఏళ్లుగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను నిరాశపరుస్తూ, కేసీఆర్‌తో కలిశారని ముఖ్యమంత్రి అన్నారు.

జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ వద్ద చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టినట్లైందని.. ఆయన వయస్సుకు, అనుభవానికి ఇది తగినది కాదు. అయినప్పటికీ, ఈనాటికీ ఆయన గౌరవానికి భంగం కలిగేలా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ముఖ్యమంత్రి చెప్పారు. మనం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తే, ఆయన అక్కడ చేరడం బాధాకరం.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడటం తప్పా అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. నేను చేస్తున్నది మంచిదా చెడా అన్నది మీరు నిర్ణయించుకోండి. ఎవరు అంటే అన్నది కాలమే తెలుస్తుంది. మీరు అందరూ అండగా నిలవాలి. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. ధైర్యంగా ఉండండి. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తాను. మనమంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నాని సీఎం రేవంత్ అన్నారు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird