Home Latest News పరుగుల వైభవం సూర్యవంశి | SuryavamsiThe Glory of Runs | రాజస్థాన్ | రాయల్స్ | ipl2026 – Andhra Waves

పరుగుల వైభవం సూర్యవంశి | SuryavamsiThe Glory of Runs | రాజస్థాన్ | రాయల్స్ | ipl2026 – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఐపీఎల్ 2026లో భాగంగా గువహటి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వైభవం ముచ్చట గొలిపింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో విరుచుకుపడిన ఈ బుల్లోడు.. బెంగళూరు బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. హుజిల్ వుడ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్సర్ల మోత మోగించాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 20 పరుగుల భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ 63 పరుగులు, కృనాల్ పాండ్యా 43 నాటౌట్ రాణించడంతో బెంగళూరు 200 పరుగులు దాటింది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వైభవ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సరు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశి కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్నారు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను సైతం లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ వైభవం స్టేడియాన్ని హోరెత్తించింది. ఆర్సీబీ అభిమానులు సైతం ఈ కుర్రాడి జోరును సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు. వైభవ్ విధ్వంసం కారణంగా రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.

గతంలోనే అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్ వేదికపైనా తనదైన ముద్రవేశారు. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంలో అతను ప్రదర్శించిన పరిణతిని క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. తన అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అలాగే ఆరెంజ్ క్యాప్ రేసులోనూ ముందంజలో నిలిచాడు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird