Home సినిమా రియల్ లైఫ్ లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘటన.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య! – Andhra Waves

రియల్ లైఫ్ లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘటన.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


  • ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఎంత పని చేసింది?
  • యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు!
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువతి!

సినిమాల్లో చూపించే మంచిని ఫాలో అయ్యేవాళ్ళు పెద్దగా ఉండరు కానీ, చెడుని మాత్రం కొందరు ఫాలో అవుతారు. ‘రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) సినిమాని తలపిస్తూ తాజాగా హైదరాబాద్(హైదరాబాద్)లో జరిగిన ఓ ఘటన కంటతడి పెట్టింది.

చిన్న సినిమాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని తండ్రి.. అత్యంత కిరాతకంగా హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తం ఉన్న ఇంజెక్షన్ ను ఇస్తాడు. మూవీ చూసిన చాలామంది ఈ సీన్ డిస్టర్బ్ చేసింది. ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్ అని మూవీ టీం చెప్పినట్లు.. దీనిని అందరూ జీర్ణించుకోలేకపోయారు.

అయితే ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా వచ్చిన తర్వాత.. ఇటీవల ఈ తరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని, ఒక యువతికి బలవంతంగా హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఇప్పటికే జైలులో ఉండగా.. ఆ ఇంజెక్షన్ వల్ల తన ఆరోగ్యానికి ఏమవుతుందోనన్న భయంతో, మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్‌లోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పి అయిన రమణి అనే యువతికి, మనోహర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని రమణిపై ఒత్తిడి తెచ్చాడు మనోహర్ . అయితే, మనోహర్ ఇప్పటికే హెచ్ ఐవీ వ్యాధితో బాధపడుతున్నాడన్న విషయం రమణికి తెలిసింది. దీంతో అతనితో పెళ్లికి నిరాకరించింది.

తనతో పెళ్ళికి ఒప్పుకోలేదన్న కోపంతో రమణిపై పగ పెంచుకున్నాడు మనోహర్. గత నెల 11వ తేదీన రమణి ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవకు దిగాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్న హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ను రమణికి బలవంతంగా ఇచ్చాడు. ఈ దారుణమైన చర్య తర్వాత మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం అతను జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఒకవైపు హెచ్ఐవీ రక్తాన్నితన శరీరంలోకి ఎక్కించడం, సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి రమణి తీవ్రంగా ఆందోళన చెందింది. ఈ ఘటన జరిగినప్పటి నుండి ఆమె మనస్తాపానికి గురైంది. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తన ప్రాణంపై గ్యారెంటీ లేదన్న భయం కూడా ఆమెను కుంగదీసింది. తన నివాసంలోనే తాజాగా ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడీ వార్త అందరిచేత కంటతడి పెట్టిస్తుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird