పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ, స్వీట్లు, ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం. కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా చెబుతున్నారు. అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..
వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు..
చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది.
చక్కెర వాడటం మానేస్తే.. గతంలో కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు. దీన్ని అనుభూతి కూడా పొందవచ్చు.
చర్మంలో కూడా మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది. ముఖ్యంగా చర్మం మీద మొటిమలు, దద్దుర్లు.. స్థిరంగా క్రమంగా తగ్గడం గమనించవచ్చు.
చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది. గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది.
చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు మారతాయి.
అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది. వారం రోజులలో స్పష్టంగా బరువు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా తగ్గడం సులువు.
*రూపశ్రీ.
