
ముద్ర, తుంగతుర్తి:
రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య సారధ్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య మాట్లాడుతూ దివంగత నేత రాష్ట్ర మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. సర్వోత్తమ్ రెడ్డి మునుముందు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మరిన్ని ఉన్నత పదవులు అందుకోసం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసిన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, తుంగతుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు, దేవాలయ చైర్మన్, యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన అజయ్ కుమార్, లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.