Home Latest News ఎవరీ రాఘవ్ చద్దా?.. ఏమా కథ? | ఇది రాఘవచద్దా | ఎందుకు | aap | తొలగించబడింది | అతనికి | గా | పార్టీ | రాజ్యసభ | అంతస్తు – Andhra Waves

ఎవరీ రాఘవ్ చద్దా?.. ఏమా కథ? | ఇది రాఘవచద్దా | ఎందుకు | aap | తొలగించబడింది | అతనికి | గా | పార్టీ | రాజ్యసభ | అంతస్తు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఎవరీ రాఘవ్ చద్దా? ఏంట‌త‌డి చుట్టూ అల్లుకున్న వివాదాలు? ఆమ్ఆద్మీ పార్టీ ఎందుకని అతడిని పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ గా తొల‌గించింది? అన్న విషయం ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన యువ నాయకుడు. వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో చ‌దువుకున్నారు. ఇక అతడి రాజకీయ ఎదుగుదల ఎలా సాగిందంటే.. అన్నా హజారే అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేజ్రీవాల్‌తో క‌ల‌సి ఉన్నారు. కేవలం 33 ఏళ్ల కే రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్ద’ల సభలో అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు.

ప్ర‌స్తుతం రాఘవ్ చద్దా.. వింత వింత ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతూ దేశ ప్ర‌జ‌ల‌ను యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు. పది ఉద్యోగాల కోసం వందలాది మంది ఫీజులు కట్టి మరీ రాస్తుంటే ఆ వచ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్ర‌శ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి ప‌రిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.

అది పక్కన పెడితే.. రాఘవ్ చద్దా మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించి ఎంపీ ఒక సెలెక్ట్ కమిటీని ప్రతిపాదిస్తూ, ఐదుగురు సంతకాలను వారి అనుమతి లేకుండా ఫోర్జరీ చేశారన్న తీవ్ర ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆరోపణ కారణంగానే రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేశారనుకోండి అది వేరే సంగతి.

రాజ్యసభ ఎంపీగా ఆయనకు కేటాయించిన టైప్-7 బంగ్లా విషయంలో పెద్ద రచ్చే జరిగింది. మొదటిసారి ఎంపీ అయిన వారికి అంత పెద్ద బంగాళా ఇవ్వకూడదని నోటీసులు రావడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2024 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు, రాఘవ్ చద్దా పార్టీకి అండగా ఉండకుండా లండన్‌లో ఉండటంపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయనకు కంటి శస్త్ర చికిత్స జరిగింది, ప్రత్యర్థులు ఆయన భయంతో పారిపోయారని చెప్పారు.

ఇక ఇప్పుడు తాజాగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించి, ఆ స్థానంలో సీనియర్లను నియమించారు. ఎందుకంటే.. గతంలో ఆయన సస్పెన్షన్ సమయంలో, రాజ్యసభ సెక్రటేరియట్ నియమాల ప్రకారం పదవుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన సమయంలో రాఘవ్ చద్దా విదేశాల్లో ఉన్న పార్టీలోని కొంతమంది సీనియర్లకు నచ్చలేదని సమాచారం. ఆయన స్థానంలో జైలుకు వెళ్లి వచ్చిన సీనియర్ నేత సంజయ్ సింగ్ లేదా ఇతర నమ్మకస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ భావించింది.

రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ల నియామకంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో కొన్ని మార్పులు చేయాలని కోరింది. ఇది కేవలం ఒక సాంకేతిక మార్పు అని పార్టీ చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం రాఘవ్ చద్దా ప్రాధాన్యత తగ్గిందనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఇటీవ‌ల బాగా వైర‌ల్ అయిన రాఘవ్ చద్దా, ఆయ‌న ప్ర‌శ్నా ప‌రంప‌ర‌కు కాస్త బ్రేక్ ప‌డిన‌ట్టుగానే చెప్పాలి. ఎంకరేజ్ చేయాల్సిన పార్టీ ఆయన్ను డిస్కరైజ్ చేయటం మీద కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird