Home సినిమా అగ్ర హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి మృతి.. లేట్ గా తెలియడానికి గల కారణం ఏంటి! – Andhra Waves

అగ్ర హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి మృతి.. లేట్ గా తెలియడానికి గల కారణం ఏంటి! – Andhra Waves

by
0 comments
అగ్ర హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి మృతి.. లేట్ గా తెలియడానికి గల కారణం ఏంటి!



-నిద్రలోనే తుదిశ్వాస విడిచిన విడిచిన సునీల్ మల్హోత్రా
-సోషల్ మీడియాలో పోస్ట్ తో విషయం బయటకి
-పోస్ట్ లో ఏముంది

సిద్దార్ధ్ మల్హోత్రా(Sidharth Malhotra).. సుదీర్ఘ కాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో రాణిస్తూ తన కంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. గత ఏడాది ఆగస్టులో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్‌తో కలిసి ‘పరమ్ సుందరి’ అంటూ పలకరించాడు. ముఖ్యంగా మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ విలన్’ సీరియల్ హంతకునిగా చెయ్యడం సిద్దార్ధ్ కెరీర్ కి అతిపెద్ద మలుపుతో పాటు మంచి బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం సిద్దార్ధ్ మల్హోత్రా ఫాదర్ చనిపోయిన న్యూస్ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. ఆ వివరాలేంటో చూద్దాం.

సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి పేరు సునీల్ మల్హోత్రా(సునీల్ మల్హోత్రా).. ఈ నెల 14న ఆయన మరణించాడు. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. రీసెంట్ గా సిద్దార్ధ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసాడు. ఈ పోస్ట్ లో ‘మా నాన్నగారు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. కాలం ఆయనకి ఎన్నో పరీక్షలకి గురి చేసిన వాటన్నింటిని తట్టుకొని నిలబెట్టాడు. ఈ రోజునే హార్ట్ స్ట్రోక్ వీల్ చైర్ కి పరిమితం చేసినా భయపడలేదు.నేను ఈ నటుడిగా ఉన్నానంటే అందుకు కారణం నా తండ్రి. నిజాయితీ, విలువలతో నన్ను పెంచారని సదరు పోస్ట్ లో పేర్కొన్నాడు. ఆయన మరణ వార్త బయట ప్రపంచానికి తెలిసింది.

కూడా చదవండి: డీసెంట్ కలెక్షన్స్ తో సైలెంట్ హిట్ గా నిలిచిన ‘నిలవే’ మూవీ

సునీల్ మల్హోత్రా నేవీ లో కెప్టెన్ గా పని చేయగా సిద్దార్హ్ మల్హోత్రా తన పంతొమ్మిదివ ఏటా నే మోడల్ గా కెరీర్ ప్రారంభించి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో హీరోగా మారాడు. ప్రస్తుతం పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ సినిమాల్లో తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో ‘వ్యాన్..ఫోర్స్ ది ఫారెస్ట్’, రేస్ పార్ట్ 4 వంటి చిత్రాలు ఉన్నాయి. లెజండ్రీ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి తో ఒక మూవీ ఉన్నట్టుగా బాలీవుడ్ టాక్.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird