తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జరుగుతున్న ఎన్నికల పోలింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయగానే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ . కరీంనగర్ జ్యోతి నగర్‌లోని ఎస్సార్ హై స్కూల్‌ని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
అదే విధంగా మంత్రి వివేక్ వెంకట స్వామి మంచిర్యాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్ లో టు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం ప్రారంభమైన మునిసిపోల్స్ ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ సాగుతుంది. ఇప్పటి వరకు చెదురుమదురు సంఘటనలు విన్న పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
.webp)