హైదరాబాద్ నగరంలో ఆక్రమణదారులపై కొరడా ఝళిపిస్తూ వారి ఆటకు హైడ్రా చెక్ పెట్టింది. ప్రజలకు చెందాల్సిన పార్కులు, చెరువులు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై హైడ్రామా కఠినంగా వ్యవహరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే నగరం నలుమూలల నాలుగు ప్రాంతాల్లో భారీ ఆపరేషన్లు చేపట్టి ఆక్రమణలను తొలగించింది. అనంతరం వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూములను రక్షణలోకి తీసుకున్నారు. ఈ చర్యల ద్వారా దాదాపు రూ.1511 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు ప్రాంతాలలో వెయ్యి గజాలకు పైగా ఉన్న పార్కులను రక్షించగా, మరో రెండు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వేల ఎకరాల చెరువుల భూములను ఆక్రమాల నుంచి విముక్తం చేసింది.
కొండాపూర్ లో చెరువులను కాపాడిన హైడ్రా శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం–మదీనాగూడ రోడ్డుకు సమీపంలోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగం కుంట చెరువును హైడ్రా ఆక్రమణల నుంచి కాపాడింది.
దాదాపు రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాల చెరువు భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీ నం చేసుకుంది.చెరువును పూర్తిగా పూడ్చివేసి, మట్టితో చప్పటి చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. స్పందించిన హైడ్రా అధికారులు అధికారులతో కలిసి జైంట్ ఇన్స్పెక్షన్ చేశారు. భూమి జంగం కుంట చెరువేనని నిర్ధారించారు. ఆక్రమణదా రులపై అధికా రులు కేసులు నమోదు చేశారు.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం చెరువు పరిధి మొత్తం ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టారు.
అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల ఆక్రమణల తొలగింపు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ వారి అల్వాల్ కొత్త చెరువులో పెద్ద ఎత్తున జరిగిన ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు 8 ఎకరాల మేర అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయి.ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువును తీవ్రంగా కలుపుతూ స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కార్మికుల కోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్యర్థాలను నేరుగా చెరువులోకి వదులుతు న్నట్లు. ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేవని స్పష్టం చేయడం ద్వారా షెడ్డులు, టెంటు సామగ్రికి సంబంధించిన నాలుగు షట్టర్లను పూర్తిగా తొలగించారు.
1100 గజాలకు పైగా పార్కులను కాపాడిన హైడ్రా
పలు కాలనీల్లో ప్రజల కోసం కేటాయించిన పార్కులను హైడ్రా తిరిగి ప్రజలకు అందించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలి పురం సాహెబ్‌నగర్ కలాన్ పరిధిలోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు హైడ్రా కాపాడింది.సర్వే నంబర్లు 132, 133లో 1982లో ఏర్పాటు చేసిన లేఔట్లో పార్కుగా కేటాయించిన వారి లేఔట్ వేసిన వారే ప్లాట్లుగా మార్చి అమ్మేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ స్థలంలో ప్రహరీ, షెడ్డులు నిర్మించగా హైడ్రా విచారణలో ఇది పార్కు భూమేనని నిర్ధారించింది. ఆక్రమణలను తొలగించి, పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే మల్కాజిగిరి జోన్ మౌలాలి సర్కిల్ పరిధిలో కాకతీయ నగర్, రాథాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును కూడా హైడ్రా రక్షించింది. జీహెచ్హెచ్గాకి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన ఈ తేదీ ఆక్రమించి నిర్మించిన ప్రహరీ, రేకుల షెడ్డులను మంగళవారం తొలగించింది.
దాడులపై వెనక్కి తగ్గేది లేదు:
హైడ్రాప్రజలకు చెందాల్సిన భూములను కబ్జా చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు. పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాలపై అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నగరమంతటా దాడులు కొనసాగుతున్నాయి.
.webp)