Home Latest News ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు | AP క్యాన్సర్ అట్లాస్| సీఎం చంద్రబాబు| క్యాన్సర్ వ్యాధి| డా. నోరి దత్తాత్రేయ| క్యాన్సర్ స్క్రీనింగ్| నివారణ| రేడియేషన్| ఏపీ ఆరోగ్య శాఖ| సర్వైకల్ క్యాన్సర్| ICMR – Andhra Waves

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు | AP క్యాన్సర్ అట్లాస్| సీఎం చంద్రబాబు| క్యాన్సర్ వ్యాధి| డా. నోరి దత్తాత్రేయ| క్యాన్సర్ స్క్రీనింగ్| నివారణ| రేడియేషన్| ఏపీ ఆరోగ్య శాఖ| సర్వైకల్ క్యాన్సర్| ICMR – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు గురువారం ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు. విజన్ స్టేట్‌మెంట్ ద్వారా 2030 నాటికి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్, మిషన్ స్టేట్‌మెంట్ ద్వారా ముందస్తు స్క్రీనింగ్‌లతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేలా అట్లాస్ ద్వారా కార్యాచరణ చేపట్టబడుతుంది. హెల్త్ ఎడ్యుకేషన్, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ప్రివెన్షన్, స్కీనింగ్, ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ కేర్ స్ట్రాటజీలో వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పురుషులు, మహిళల నుంచి నమోదు చేసిన సమాచారం ఆధారంగా చికిత్సలు, సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్‌మెంట్ వారిగా అట్లాస్‌లో వివరాలు పొందారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఎంతమంది, ఏ రకమైన క్యాన్సర్ ఉన్నారో గుర్తించేందుకు, స్థానికంగా చికిత్సలు అందుబాటులోకి రావడానికి వీలుగా సమాచారం తెలిసేలా ఈ అట్లాస్ కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఏపీలో 32,657 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని… ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి 20 శాతం కేసులు పెరుగుతాయని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు.
తొలిసారిగా ఏపీలో క్యాన్సర్ అట్లాస్ రూపకల్పన దేశంలోనే జరిగింది. రోగులను మ్యాపింగ్ చేసి 23 బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల ద్వారా రోగులకు డే కేర్ కీమో థెరపీ, పాలియేటివ్ కేర్ చికిత్స అందించే అవకాశం ఉంది. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు పీవీ వ్యాక్సినేషన్ వివిధ సంస్థలు, ఎన్ఆర్ఐల నుంచి కూడా సహకారం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెరిగిందని .. ముందస్తు పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird