మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో వెలుతురు లేదని ఆయన చెప్పారు. రన్ వే స్పష్టంగా కనిపిస్తున్నదా? లేదా బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పైలట్లను అడగగా, కనిపించడం లేదని వారు సమాధానం ఇచ్చారని మంత్రి వివరించారు.
దీంతో విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టిందని చెప్పారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో మళ్లీ రన్‌వే కనిపిస్తున్నదా అని ఏటీసీ ప్రశ్నించగా, ఈసారి పైలట్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దాంతో ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చాను, ఆ వెంటనే విమానం ప్రమాదానికి గురైందని.ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపినట్లు తెలిపారు. అధికారులతో కలిసి కేంద్ర మంత్రి ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు.