5

ఏపీ రాజధాని అమరావతి భూములు ఇచ్చిన రైతులకు తుది విడత ప్లాట్ల కేటాయింపునకు తేదీ ఖరారైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ-లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించబడతాయి. నిబంధనల ప్రకారం.. పూర్తి పారదర్శకంగా ఈ-లాటరీ పద్ధతిలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ముందుగా ఈ నెల 28న లాటరీ నిర్వహించాల్సి ఉండగా ఒక రోజు అంటే జనవరి 29కి వాయిదా వేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి నగరానికి ముఖ్యమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ రోడ్డు నిర్మాణ భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల జనవరి 23న రైతులకు లాటరీ ద్వారా భూములు కేటాయించిన విషయం తెలిసిందే. గతంలో భూీకరణ ఉన్న భూములు ఇచ్చిన రైతులలో కొందరు వేరే చోట భూములివ్వాలని నిర్ణయించారు. దీనితో ఈ-లాటరీ ప్రక్రియను అనుసరించడంతో రైతులు అభ్యంతరాలు తెలిపారు. ఈనెల 29న మరోసారి పూర్తి స్థాయిలో ఈ-లాటరీ ద్వారా తుది విడతలో ప్లాట్లను కేటాయిస్తానని ప్రకటించారు.