Home Latest News అమలాపురంలో వెయ్యి అడుగులు భారీ పిడకల దండ | అమలాపురం పిడకల్ దందా| అంబేద్కర్ కోనసీమ జిల్లా| భోగి పండుగ| పిఠాపురం| జై గణేశ స్వామి| గంగిరెద్దు| హరిదాస్| ఏపీలో భోగి వేడుకలు| నార్నిపట్నం – Andhra Waves

అమలాపురంలో వెయ్యి అడుగులు భారీ పిడకల దండ | అమలాపురం పిడకల్ దందా| అంబేద్కర్ కోనసీమ జిల్లా| భోగి పండుగ| పిఠాపురం| జై గణేశ స్వామి| గంగిరెద్దు| హరిదాస్| ఏపీలో భోగి వేడుకలు| నార్నిపట్నం – Andhra Waves

by andhra andhrawave
0 comments
అమలాపురంలో వెయ్యి అడుగులు భారీ పిడకల దండ | అమలాపురం పిడకల్ దందా| అంబేద్కర్ కోనసీమ జిల్లా| భోగి పండుగ| పిఠాపురం| జై గణేశ స్వామి| గంగిరెద్దు| హరిదాస్| ఏపీలో భోగి వేడుకలు| నార్నిపట్నం


జనవరి 14, 2026 11:57AMన పోస్ట్ చేయబడింది


తెలుగువారు మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి ఉత్సవాల్లో మొదటి రోజు నిర్వహించే భోగి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తెల్లవారుజామునే అభ్యంగ స్నానమాచరించి.. ఆవు పేడతో చేసే పిడకలను భోగి మంటల్లో వేస్తారు. ఇంట్లోని పాత, ఉపయోగంలో లేని వస్తువులను భోగి మంటల్లో వేస్తే శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా.. భోగి పండుగను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమలో రూపొందించిన భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది.

అమలాపురంలోని రంగాపురం గ్రామస్థులు ఈ భోగి మాలలతో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు. ఆ ఊళ్లోని విశ్వనాథ రాజు కుటుంబం.. స్థానికులతో కలిసి ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేసింది. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు గత ఆరేళ్లుగా భారీ భోగి దండలను గ్రామస్థులు తయారు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన భోగి దండ తయారీ నేడు 1000 అడుగులకు చేరిందని ఆ ఊరి ప్రజలు వివరించారు.

సుమారు అర కిలోమీటర్ మేర ఉన్న ఈ భారీ భోగి మాలను గ్రామస్థులతో కలిసి విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు భోగి మంటల్లో వేశారు. ప్రస్తుతం ఈ భారీ భోగి దండ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేశ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 14 వేల ఆవు పిడకలతో భోగిమంట వేశారు. నుంచి మేళ తాళాలు, తప్పెడు గూళ్లు, గంగిరెద్దులు, హరిదాసుల సంకీర్తనలతో కోటగుమ్మం సెంటర్ వద్ద భోగి మంటలు వేశారు. ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ భోగి మంట వద్ద ప్రత్యేక పూజలు చేశారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird