జనవరి 12, 2026 2:39AMన పోస్ట్ చేయబడింది

గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం (జనవరి 11) శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గండికోట చారిత్రక, సాంస్కృతిక, కళావైభవం ఉట్టిపడేలా సాగిన ఈ శోభాయాత్రతో కన్నుల పండువగా అత్యంత వైభంగా ఉత్సవ వాతావరణంలో సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులు ఉన్నారు.
గ్రాండ్ కెన్వాస్ ఎన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన గండి కోట ఉత్సవాల ప్రారంభానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్ వచ్చే రెండు సంవత్సరాలలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతామన్నారు. గండికోట మరింత అభివృద్ధి చెందడానికి, యునెస్కో ద్వారా గుర్తింపు రావడానికి స్థానికుల సహకారం అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్.సవితఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్‌పి నచికేతన్ విశ్వనాథ్, ప్రముఖ రచయితలు తవ్వా ఓబుల్‌రెడ్డి, సుధారాణి పాల్గొని ప్రసంగించారు. విశిష్ఠ అతిథిగా పాల్గొన్న గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గండికోట గేయాలాపన చేశారు.
.webp)