Home సినిమా భయపెడుతున్న మెగా సెంటిమెంట్.. అనిల్ రావిపూడి ఫస్ట్ ఫ్లాప్ చూడబోతున్నాడా? – Andhra Waves

భయపెడుతున్న మెగా సెంటిమెంట్.. అనిల్ రావిపూడి ఫస్ట్ ఫ్లాప్ చూడబోతున్నాడా? – Andhra Waves

by
0 comments
భయపెడుతున్న మెగా సెంటిమెంట్.. అనిల్ రావిపూడి ఫస్ట్ ఫ్లాప్ చూడబోతున్నాడా?



– ఆందోళన కలిగిస్తున్న నెగెటివ్ సెంటిమెంట్
– కొరటాల శివ బాటలో అనిల్ రావిపూడి పయనిస్తాడా?
– ఈ సంక్రాంతికి మొదటి ఫ్లాప్ ఖాతాలో వేసుకోబోతున్నాడా?
– అసలు ఈ మెగా నెగెటివ్ సెంటిమెంట్ ఏంటి?

టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకులలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒకరు. ‘పటాస్’ నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు అనిల్ దర్శకత్వంలో ఎనిమిది సినిమాలు రాగా.. అందులో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సంక్రాంతికి చిరంజీవి(చిరంజీవి)తో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రావిపూడి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, జనవరి 12న థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక నెగెటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో అనిల్ రావిపూడికి మొదటి ఫ్లాప్ తప్పదా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. (మన శంకర వర ప్రసాద్ గారు)

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో చిరంజీవి తెలుగు చిత్రసీమలో ఎన్నో రికార్డులను సృష్టించారు. అలాంటి చిరంజీవిపై నెగెటివ్ సెంటిమెంట్ ముద్ర వేస్తూ.. సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. హిట్స్ లో ఉన్న డైరెక్టర్.. చిరుతో సినిమా చేస్తే అది ఫ్లాప్ అవుతుంది అనేది ఆ పోస్ట్ ల సారాంశం. అందుకు ఉదాహరణగా.. హిట్స్ లో ఉన్న కొరటాల శివ, చిరంజీవితో ‘ఆచార్య’ చేసి ఫస్ట్ ఫ్లాప్ చూశాడని అంటున్నారు. అంతేకాదు ‘వెంకీ’ తరువాత ‘అందరివాడు’తో శ్రీను వైట్ల, ‘మల్లీశ్వరి’ తరువాత ‘జై చిరంజీవ’తో విజయభాస్కర్.. ఇలా పలువురు దర్శకులు పరాజయాలను అందుకున్నారు.

ఇది కూడా చదవండి: రాజు గారికి హ్యాండిచ్చిన మారుతి.. నమ్మి అవకాశమిస్తే..?

ఈ నెగెటివ్ సెంటిమెంట్ ఓ రకంగా అనిల్ రావిపూడికి ఆందోళన కలిగించేదే. అయితే అసలు ఈ నెగెటివ్ సెంటిమెంట్ నిజం కాదని.. గత సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరంజీవితో సినిమా చేసి హిట్ కొట్టిన దర్శకులు ఎందరో ఉన్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

‘పవిత్ర బంధం’ తర్వాత ‘హిట్లర్’తో ముత్యాల సుబ్బయ్య హిట్ కొట్టాడు. ‘ప్రేమించుకుందాం రా’ తర్వాత ‘బావగారూ బాగున్నారా?’తో.. ‘లక్ష్మీనరసింహా’ తర్వాత ‘శంకర్ దాదా MBBS’తో జయంత్ సి పరాన్జీ రెండు విజయాలు అందుకున్నారు. అదే బాటలో ‘దిల్’ తర్వాత ‘ఠాగూర్’తో, ‘అఖిల్’ తర్వాత ‘ఖైదీ నెం.150’తో.. వినాయక్ కూడా రెండు హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ‘వెంకీమామ’ తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి కూడా ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ చూశాడు. ఇలా గత చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండా.. చిరంజీవితో హిట్ కొట్టిన దర్శకులు ఎందరో ఉన్నారని ఫ్యాన్స్ పెద్ద లిస్ట్ నే బయటపెడుతున్నారు.

మరి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో అనిల్ రావిపూడి తన విజయపరంపరను కొనసాగిస్తాడా? లేక ఊహించని విధంగా కొరటాల శివల మొదటి ఫ్లాప్ ని ఖాతాలో వేసుకుంటాడా? అనేది త్వరలోనే తేలిపోతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird