
-ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సాక్షి వైద్య చెప్పిన నిజం ఏంటి!
-దీంతో ఇక రూమర్స్ కి చెక్ పడినట్లేనా
-అసలు సాక్షి వైద్య ఏమంటుంది
సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)స్టామినాని మరింతగా ఎలివేట్ చేయబోతున్న చిత్రం ‘ఉస్తా వైద్యద్ భగత్ సింగ్'(ఉస్తాద్.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ ప్రముఖ చిత్రం ద్వారా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ సినిమా అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసా ఇస్తున్న హీరోయిన్. లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి పుల్ స్టాప్ పడింది.
సాక్షి వైద్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్ లో కీలకమైన క్యారెక్టర్ ని పోషించే అవకాశం వచ్చింది. రేపే షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నామని యూనిట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు.కానీ మా ఫ్యామిలీలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. దీంతో డేట్స్ సర్దుబాటు లేకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది. కానీ నా గత చిత్రాలు ప్లాప్ కావడంతో నన్ను తీసేశారనే వార్తలు చాలానే వచ్చాయి. ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారేమో. కానీ నేను మాత్రం అలాంటి వాటిని పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకు వెళ్తుంటాను అని సాక్షి వైద్య చెప్పుకొచ్చింది.
సాక్షి వైద్య ఈ నెల 14న సంక్రాంతి కానుకగా శర్వానంద్ తో కలిసి నారీనారీ నడుమమురారి తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రచార చిత్రాల ద్వారా అయితే సాక్షి వైద్య తన రక్టర్ ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోతోందని తెలుస్తుంది. 2023 లో అఖిల్ అక్కినేని, సురేంద్ర రెడ్డి ల ‘ఏజెంట్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య వరుణ్ తేజ్ తో గాండీవ దారి అర్జున లో కూడా జత కట్టింది. నారీ నారీ నడుమ మురారి ఆమెకి మూడవ చిత్రం.
