డిసెంబర్ 27, 2025 3:13PMన పోస్ట్ చేయబడింది

బీఆర్ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ అని ఆరొపించారు. దీనితో అది బ్లాస్టింగ్ చేయడంతో 3, 5వ మోటర్లు పని చేయడం లేదు. హరీష్ రావు నిర్వాకం వల్ల ఈ రోజు కేవలం 3 మోటర్లే పనిచేస్తున్నాయి అని అన్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ‘జాగృతి జన బాటలో’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీరెడ్డి పాలమూరు– ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్, పంప్ హౌస్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కృష్ణా జలాలపై మాట్లాడిన కవిత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నప్పటికీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగింది.
తాము వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించామని, అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు, వ్యవస్థలు ఎక్కడా పూర్తిగా నిర్మించలేదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అది నిజమేనని కవిత అన్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్‌వన్ జిల్లా అని, అక్కడ 25 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయని స్పష్టం చేశారు.
.webp)