డిసెంబర్ 18, 2025 1:55PMన పోస్ట్ చేయబడింది

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పసిపిల్లలను బెజవాడలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు గల చిన్నారులను ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ముఠా ఒక్కో శిశువునూ మూడున్నర నుంచి ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరచి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
