Home Latest News తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన భాగ్యనగరం | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్| ఫ్యూచర్ సిటీ| తెలంగాణ ఫ్యూచర్ సిటీ| రైజింగ్ గ్లోబల్ సమ్మిట్| సీఎం రేవంత్ రెడ్డి| హైదరాబాద్| మీర్పేట్| ముచ్చర్ల| గ్లోబల్ సమ్మిట్ 2025| హైదరాబాద్| దావోస్ సమ్మిట్ – Andhra Waves

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన భాగ్యనగరం | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్| ఫ్యూచర్ సిటీ| తెలంగాణ ఫ్యూచర్ సిటీ| రైజింగ్ గ్లోబల్ సమ్మిట్| సీఎం రేవంత్ రెడ్డి| హైదరాబాద్| మీర్పేట్| ముచ్చర్ల| గ్లోబల్ సమ్మిట్ 2025| హైదరాబాద్| దావోస్ సమ్మిట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన భాగ్యనగరం | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్| ఫ్యూచర్ సిటీ| తెలంగాణ ఫ్యూచర్ సిటీ| రైజింగ్ గ్లోబల్ సమ్మిట్| సీఎం రేవంత్ రెడ్డి| హైదరాబాద్| మీర్పేట్| ముచ్చర్ల| గ్లోబల్ సమ్మిట్ 2025| హైదరాబాద్| దావోస్ సమ్మిట్


డిసెంబర్ 7, 2025 8:30PMన పోస్ట్ చేయబడింది


తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు.

నేటి మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్‌లో వివిధ అంశాల నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్‌డైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్, ప్రసంగించారు.

మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడులు, ప్రభుత్వంవైపు నుంచి సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరించారు. రెండు రోజుల్లో మొత్తం 27 ప్రత్యేక సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్దం చేశారు.

వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.

సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సులో జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలు సిద్ధమయ్యాయి.

ఇక అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్‌లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్ లో పొందుతున్నారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్పుడు పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు అందించనున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird