Home Latest News చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తి…ఫైనల్ రిపోర్ట్ | చిత్రపురి కాలనీ| సహకార సంఘం| తుది నివేదిక| తెలంగాణ ప్రభుత్వం| తమ్మారెడ్డి భరద్వాజ| వల్లభనేని అనిల్| టోలీ చెక్క – Andhra Waves

చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తి…ఫైనల్ రిపోర్ట్ | చిత్రపురి కాలనీ| సహకార సంఘం| తుది నివేదిక| తెలంగాణ ప్రభుత్వం| తమ్మారెడ్డి భరద్వాజ| వల్లభనేని అనిల్| టోలీ చెక్క – Andhra Waves

by andhra andhrawave
0 comments
చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తి...ఫైనల్ రిపోర్ట్ | చిత్రపురి కాలనీ| సహకార సంఘం| తుది నివేదిక| తెలంగాణ ప్రభుత్వం| తమ్మారెడ్డి భరద్వాజ| వల్లభనేని అనిల్| టోలీ చెక్క


డిసెంబర్ 3, 2025 8:18PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాదు ఆసుపత్రి గచ్చిబౌలి లో ఉన్న చిత్రపురి కాలనీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన భారీ అక్రమాలపై దాదాపు పదిహేనేళ్ల విచారణకు తెర పడింది. 2005 నుండి 2020 వరకూ చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ తన ఫైనల్ రిపోర్ట్‌ను నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది.

విచారణలో భాగంగా సొసైటీ నిధుల దుర్వినియోగం, కేటాయింపుల్లో గందరగోళం, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు బయటపడినట్లు కమిటీ నివేదికలో స్పష్టమైంది. ఈ అక్రమాలకు 15 మందిని బాధ్యులుగా నిర్ణయించారు.

ఈ విచారణలో ప్రధానంగా ప్రస్తావించబడినవారిలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, అలాగే బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ పేర్లు ఉన్నాయి. సొసైటీ కమిటీలో సభ్యులుగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి వీరికి సంబంధం ఉన్నట్లు రిపోర్ట్ సూచిస్తోంది.

మొత్తం గా జరిగిన అక్రమాల కారణంగా సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు రూ. 43.78 కోట్లు రికవరీ, అదనంగా 18 శాతం వడ్డీతో సహా వసూలు చేయాలని గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.ఫైనల్‌ రిపోర్ట్ కాపీని ఇప్పటికే 15 మందికి పంపినట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం రిపోర్ట్‌ను పరిశీలించిన తరువాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird