పశ్చిమ బెంగాల్లో ఒక ఉపాధ్యాయుడు గురువునన్నసంగతి మరచిపోయి విద్యార్థులపై హత్యాయత్నం చేశారు. ఏకంగా విద్యార్థులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ముర్షిదాబాద్ జిల్లాలో తన ఇంటి బయట ఆడుకుంటున్న పాఠశాల విద్యార్థులపై ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాల్పులకు తెగబడ్డాడు.
బనిపూర్ గ్రామంలో సమీర్ అనే ఉపాధ్యాయుడి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మధ్యాహ్నం (ఫిబ్రవరి 20) కొండ మంది విద్యార్థులు క్రికెట్, ఫుట్ బాల్ ఆడుగుతారు. వారి ఆటల్లో పలు మార్లు బంతి ఉపాధ్యాయుడు సమీర్ ఇంటి గోడలు, తలుపులకు తాకింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన ఉపాధ్యాయుడు.. తన ఇంటి పై నుంచి మైదానంలో ఆడవిద్యార్థులపైకి విచక్షణారహితంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు. స్థానికులు విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స. అతడు కోలుకుంటున్నాడు. కాగా విద్యార్థులపై కాల్పులకు తెగబడిన ఉపాధ్యాయుడు సమీన్ ను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
