కర్ణాటక పాలిటిక్స్‌లోకి టీవీకే ఎంట్రీ సంచలన వ్యూహం..
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి, ఇటీవల 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్, ‘దళపతి’ విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి 34.9 శాతం ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
అయితే తమిళనాడులో సాధించిన ఈ చరిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తన ‘టివికె’ పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు.
కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) మరియు గ్రామీణ స్థానిక సంస్థలు (GBA) ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్‌ను సిద్ధం చేస్తుంది. కర్ణాటక వ్యాప్తంగా విజయ్ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపు 25 30 శాతం వరకు ఉండటంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకో టీవీకే అధినేత.
ఈ పరిణామాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను మట్టికరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికి చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు.
గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ, విజయ్ ప్రజాబలం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే, అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రా సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది
.webp)