Home Latest News తెరపైకి జయమ్మ పంచాయితీ…కెలుక్కున్నావేమో జగనన్నా! | బి టెక్ రవి | వైఎస్ జగన్ | వైఎస్ కుటుంబం | టీడీపీ | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | హత్య ఆరోపణలు | ఫ్యాక్షన్ రాజకీయాలు | రాజకీయ చరిత్ర | వివాదం – Andhra Waves

తెరపైకి జయమ్మ పంచాయితీ…కెలుక్కున్నావేమో జగనన్నా! | బి టెక్ రవి | వైఎస్ జగన్ | వైఎస్ కుటుంబం | టీడీపీ | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | హత్య ఆరోపణలు | ఫ్యాక్షన్ రాజకీయాలు | రాజకీయ చరిత్ర | వివాదం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు, హింసాత్మక ప్రవృత్తి, వారి ఫ్యాక్షన్ రాజకీయ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను ఎంతో మంచివాడ్నని నిరూపించే యత్నంలో భాగంగా తమ ఇంట్లో జరిగిన మూడు మరణాలకు కుట్ర సిద్ధాంతం రుద్ది.. వాటన్నటినీ చంద్రబాబుపై నెట్టడానికి విఫలయత్నం చేసిన జగన్ ప్రస్తుతం చూస్తే తానే ఇరుక్కుపోయారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బీటెక్ రవి వంటి వారు రాజారెడ్డి ఎంతటి ఫ్యాక్షనిస్టో చెప్పడం అటుంచితే.. అసలు వీరు రాజకీయ కుటుంబానికి చెందిన వారే కాదని కుండ బద్ధలు కొట్టారు. వైయస్ ఫ్యామిలీ మొదట బ్రిటీషర్లకు తొత్తులుగా పని చేసేవారనీ.. వీరిదసలు రాజకీయ కుటుంబమే కాదని అంటారు బీటెక్ రవి. అప్పట్లో ఈ కుటుంబం బ్రిటీషర్లకు వంత పాడడంతో.. ఊరి నుంచి తరిమేస్తే పులివెందులకు వలస వచ్చారనీ రవి. ఆ రోజుల్లో రాజారెడ్డి భార్య జయమ్మ పంచాయితీ వార్డు మెంబర్‌గా పోటీ చేస్తే ఓడిపోయారనీ.. వార్డుమెంబర్‌గా కూడా గెలవడం చేతగాని కుటుంబమని ఎద్దేవా చేశారు బీటెక్ రవి.

రాజశేఖర్ రెడ్డి తొలి గెలుపు కూడా నిఖార్సయిన గెలుపు కాదనీ.. ఏదో ఫ్లోలో కొట్టుకొచ్చిన గెలుపనీ.. ఆయన గెలిచింది ఒక పార్టీ నుంచి అయితే, కలిసింది మరో పార్టీ అన్న ఆరోపణలున్నాయి. ఇటు రెడ్డి ఓట్లతో పాటు మతపరమైన ఓట్లను కూడా కలుపుకుని గెలిచిన విధం స్పష్టంగా కనిపిస్తుందంటారు కొందరు.. అప్పట్లో వైయస్ నిత్య అసంతృప్త వాదిగా ఉంటూ, ఎన్నో రకాలుగా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టిన గతమని కొందరు అంటారు. వైయస్ అధికారంలో ఉండగా పీవీలాంటి సీనియర్ నేత మరణిస్తే.. పార్టీ పరంగా ఇవ్వాల్సిన గౌరవం కూడా సరిగా నిర్వహించలేదన్న కామెంట్లు కూడా కొందరు చేస్తారు.

ఇప్పుడిదంతా ఇలా ఉంటే, అనవసరంగా జగన్ ఈ తేనెతుట్టె కదిలినట్టు అయ్యిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి గతమంతా తవ్వి పోడం మాత్రమే కాకుండా వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి విదేశీ విధాన వ్యవహారశైలి ఎలాంటిది? అన్న విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. అనవసరంగా జగన్ ఇదంతా కెలుక్కున్నారనీ.. చేజేతులా కొని తెచ్చుకున్నారనీ వైసీపీ కార్యకర్తలు. దీనంతటిని బట్టీ చూస్తుంటే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా ఉందన్న మాట కూడా వినిపిస్తోంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird