Home Latest News బీఆర్ఎస్ బ్యాక్టు టీఆర్ఎస్! | BRA తిరిగి trs | ktr | సూచిస్తుంది | పార్టీ | నామ్ | మార్పు | కవిత | చాలా | దావా – Andhra Waves

బీఆర్ఎస్ బ్యాక్టు టీఆర్ఎస్! | BRA తిరిగి trs | ktr | సూచిస్తుంది | పార్టీ | నామ్ | మార్పు | కవిత | చాలా | దావా – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వైపు మొగ్గు చూపుతోందా? బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే విషయంలో మల్లగుల్లాలు పడుతోందా? అంటే కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. కల్వకుంట్ల కవిత తాజాగా పాత పేరుతోనే కొత్త అజెండాను ప్రకటించబోతున్నట్లు ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో గుర్తింపు తెచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఎవరికీ సొంతం కాదు, అది ఖాళీగా ఉంది అని ఆమె వ్యాఖ్యానించడంతో కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని భావన దాదాపుగా ఖరారైపోయిందన్న సర్వత్రా వ్యక్తం అయ్యింది. గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు, పాత పేరు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫ్రీజ్ అయిందని, నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ఆ పేరును దక్కించుకోవచ్చని కూడా కవిత చెప్పారు. దీంతో ఆమె తన పార్టీకి టీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని పరిశీలకులు కూడా అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ సెంటిమెంటుతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ ను మళ్లీ తెరమీదకు తీసుకురావడం ద్వారా.. ప్రజలను, బీఆర్ఎస్ శ్రేణులనూ తన కొత్త పార్టీ వైపు ఆకర్షించేందుకు కవిత వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. పార్టీ పేరు మార్పుపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పేరు వల్ల పార్టీకి ప్రజలతో ఉన్న అనుబంధం ఒక్కసారిగా దెబ్బతిన్న మాట వాస్తవమేనన్న ఆయన.. పార్టీ క్యాడర్ కూడా తిరిగి పాత పేరే పార్టీకి పెట్టాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు ఆ విషయంపై ఆలోచన జరుగుతోందని, బీఆర్ఎస్ బ్యాక్ టు టీఆర్ఎస్ దిశగా పార్టీ కేసీఆర్ ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు.

కేటీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ పేరు విషయంలో బీఆర్ఎస్, కవిత కూడా ప్రయత్నాలు చేయాలని అర్ధమౌతోంది. అన్నిటికీ మించి టీఆర్ఎస్ చుట్టూ సాగుతున్న రాజకీయం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ పేరు కోసం పోటీలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird