హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును పరిశీలించారు. డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించినట్టు తేలడంతో వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా సంచలన విషయం బయటపడింది.
పోలీసుల తనిఖీల్లో కారులో నెంబర్ ప్లేట్ మార్పిడి కోసం ప్రత్యేకంగా తయారీ అమర్చినట్లు గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. వాహనంలో బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ మారే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ నెంబర్ ప్లేట్‌లతో ట్రాఫిక్ కెమెరాలను మభ్యపెట్టి చలాన్ల నుంచి తప్పించుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
కారు ఓనర్ తెలివితేటలు చూసి పోలీసులు ఖంగు తిన్నాడు. ఆ ప్లేట్లతో చెలగాటం చేయడం తీవ్ర మైన నేరమని, ఇది చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు కొనసా గిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
