ముంబైలో శనివారం (ఏప్రిల్ 11) తెల్లవారుజామున సినిమా ఫక్కీలో బంగారం స్మగ్లింగ్ కు ప్రయత్నించిన కెన్యా నుంచి వచ్చిన మహిళల బృందాన్ని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానశ్రయంలో జరిగింది. ముందుగానే విశ్వసనీయ సమాచారం అందజేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే తమ వద్ద మాట వేసిన డిఆర్ఐ బృందం తనిఖీలు కఠినతరం చేయడంతో ఆ మహిళల్లో కొందరు బ్యాగులనే అక్కడే పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విమానాశ్రయంలో దాదాపు రెండు గంటలపాటు హైడ్రామ సాగింది. అధికారులను ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు డిఆర్ఐ బృందం వారిని అదుపులోకి తీసుకుంది.
24 మంది మహిళల వద్ద నుంచి మొత్తం 30 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.38 కోట్లుగా అంచనా వేశారు అధికారులు.ఈ కేసులో 24 మంది మహిళలను అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయంలో ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
.webp)