Home Latest News చంద్రబాబు లెటర్ ప్యాడ్ లో అమరావతి అని ఎందుకు లేదు? | వాస్తవ వేదికలో అమరావతిపై డోలేంద్రప్రసాద్ మరియు కంఠమనేని రవిశంకర్ చర్చ | అమరావతి | రాజధాని | మావిగన్ – Andhra Waves

చంద్రబాబు లెటర్ ప్యాడ్ లో అమరావతి అని ఎందుకు లేదు? | వాస్తవ వేదికలో అమరావతిపై డోలేంద్రప్రసాద్ మరియు కంఠమనేని రవిశంకర్ చర్చ | అమరావతి | రాజధాని | మావిగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక మండుతున్న నిప్పుకణమే. గత పదేళ్లుగా ఈ పేరు మారుతూ, రూపు మారుతూ ప్రజలను అయోమయంలో నెట్టేస్తోంది. తాజాగా అమరావతికి చట్టబద్ధత లభించింది. అయితే వైసీపీ అధినేత రాజధానిగా ప్లాన్ చేసిన మావిగన్ ప్రతిపాదన సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కూడా. ఈ నేపథ్యంలోనే తెలుగువన్ వాస్తవ వేదిక లో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ రాజధాని భవిష్యత్ పై సమగ్రంగా చర్చించారు.

ఈ చర్చలో డోలేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్’ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై డోలేంద్ర ప్రసాద్ తెలుగువన్ వాస్తవ వేదికలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న అస్పష్టతను, రాజకీయ నాయకుల ద్వంద్వ విధానాలనూ ఎండగట్టారు. ముఖ్యంగా జగన్ మావిగాన్’ కాన్సెప్ట్, ప్రస్తుత అమరావతి అభివృద్ధిపై ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదని, అది ఒక జీవకళతో ఉట్టిపడే నగరం కావాలన్నారు.


2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి పాలన వికేంద్రీకరణ చేసింది. అయితే అది మాటలకే పరిమితమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందిన తరువాత జగన్ అమరావతిపై తన వ్యతిరేకతను స్పష్టంగా చాటుతూ.. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని కలిపి మావిగాన్ అంటూ చేసిన కొత్త ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాస్తవ వేదికలో డోలేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

అమరావతి పేరు ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద ఉందా అని ప్రశ్నించారు. అమరావతి పేరు సీఎం లెటర్ హెడ్ మీదే లేకుంటేఇన్వెస్టర్లకు నమ్మకం ఎలా కలుగుతుందని నిలదీశారు. అమరావతి-విజయవాడ ఏర్పాటు వాస్తు దోషం ఉందంటూ వస్తున్న ప్రచార పాలకులు ఎలా విస్మరించారని. రాజధానిలో కేవలం మాల్స్ కడితే సరిపోదని, అక్కడ జనం రాకపోకలు ఉండాలని, అప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి అక్కడ ఉండాలన్నారు. తెలంగాణతో ఆంధ్రాలో రాజకీయ మధ్య సంకుచిత మనస్తత్వం ఎక్కువైందని, ఒక ప్రభుత్వం ప్రారంభించిన పనిని మరొక ప్రభుత్వం నాశనం చేయడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.

రాజధాని ఒక డెడ్ సిటీలా మారకుండా ఉండాలంటే తక్షణమే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యం లేకుండా మళ్లీ ఎన్నికలు వెళ్లేలోగానే పూర్తి చేయాలన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో అమరావతికి స్పష్టమైన రూపురేఖలు వస్తాయని, ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా కాదనలేని విధంగా అభివృద్ధి జరగాలన్నారు.

జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేనిల చర్చను తెలుగువన్ వాస్తవ వేదికలో చూడవచ్చు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird