ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై హైదరాబాద్లో మోసం, బెదిరింపుల కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు, మైక్రో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో రూ.10 కోట్ల మేర మోసం జరిగింది. పెట్టుబడులు పెట్టవచ్చని నమ్మబలికి భారీ స్థాయిలో వసూలు చేసి తిరిగి చెల్లించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
