అవి 1990ల నాటి రోజులు. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అనే రెండు షెడ్యుల్డ్ క్యాస్ట్, తెగలు మాత్ర మే ఉంటాయ’నుకునేవాళ్లం. ఇన్నేసి ఉపకులాలున్నట్టు ఎవరికీ పెద్దగా తెలియక పోయేది. కానీ అప్పట్లో మంద కృష్ణ అనే ఒకతను వచ్చి.. నా పేరు పూర్తిగా మంద కృష్ణ మాదిగ అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్య పోయారు. కారణం అప్పట్లో మాల, మాదిగలు అని ధైర్యంగా చెప్పుకునేవాళ్లే లేక పోయేవారు. ఆ తర్వాత మాల అనే కులం పేరు తగిలించుకునే మాల వారు కూడా తయారయ్యారు.
మాల అంటే మల్ల యుద్ధంలోంచి పుట్టిన పదం అయితే, మాతంగి అనే దేవతను ఆరాధించేవారే మాదిగలయ్యారనీ అంటారు. ఇంత పవిత్రమైన పదాలు తర్వాత రోజుల్లో తక్కువగా చూడబడ్డం అనే ఒకానొక దురాచారం బద్ధలు కొట్టినట్టు అయ్యింది.
అందులో భాగంగా మంద కృష్ణ ధైర్యంగా ముందుకొచ్చి.. ఏం మీరేనా రెడ్డి, చౌదరి, నాయుడు, శర్మ, శాస్త్రి, గుప్త.. అని మీ పేరు చివరిలో.. కులం తోకలు తగిలించుకునేది? మాకూ ఆ దమ్మూ ధైర్యం ఉందనే తెగేసి చెప్పడడం మాత్రమే కాకుండా.. దాన్ని తన పేరు చివర్న తగిలించుకుని మరీ ముందుకొచ్చి గుండెలుదీసిన బంటులా నిలిచారు. ఆపై వర్గీ పెట్టారుకరణపై పోరాటం మొదలు.
ఇక పోతే రేణుకా చౌదరి. ఈమె కూడా అంతే.. తన కులం పేరు చెప్పడానికి ఏమంత వెనకాడరు. పైపెచ్చు తాను పుట్టిన కమ్మ కులం.. ఈ సమాజానికి ఎంతో చేస్తోంది. అలాంటి కులం పేరు చెప్పుకోవడంలో తప్పేముంది? అంటూ గళం విప్పిన వీర వనితగా చరిత్రకెక్కారు. దీనితో కొందరు కమ్మ కులస్తులు.. ఇలాంటి మహిళకున్న తెగువ మా కులం పురుషులలోనూ ఉంటే ఎంత బాగుండేదని కొందరు కామెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.
ఈ ఇద్దరి కులాల మధ్య వ్యత్యాసం చాలానే ఉండొచ్చు. చాతుర్వర్ణ వ్యవస్థలో కాస్త తేడాలుండొచ్చు. కానీ ఈ కుల నిచ్చెనల భారతావనిలో.. ఎవరి కులం వారికి గొప్ప అని నిరూపించిన ధీశాలుగా నిలిచారు.. మందకృష్ణ మాదిగ, రేణుకా చౌదరి.
ఇటీవల ఈ ఇద్దరూ మళ్లీ వార్తలకెక్కారు. వీరిలో మంద’కృష్ణ మాదిగ చేసిన కామెంట్లు ఏంట’ని చూస్తే బ్రాహ్మ’ణులే ఈ స’మాజంలో కుల కార్చిచ్చు రాజేశర’ని దుయ్యబట్టారాయ’న. అంతే కాదు బ్రహ్మాణుల్లా మాలోనూ పూజలు పునస్కారాలు చేయడంలో సిద్ధహస్తులున్నారనీ అన్నారు. ఒక వేళ హిందూ మతమే అంత గొప్పదైతే.. ప్రపంచమంతా ఎందుకు విస్తరించలేదని ధైర్యంగా ప్రశ్నించారు మంద కృష్ణ మాదిగ.
ఇక రేణుకా చౌదరి ఇటీవల అమరావతి బిల్లు విషయంలో రాజ్యసభలో మాట్లాడుతూ.. అమరావతని పెట్టరా పేరు.. పిలవరా కమ్మరావతి అని తాను చేస్తున్న ఇంగ్లీష్ ప్రసంగంలో తెలుగులో ఈ కామెంట్లు చేసి.. హెడ్‌లైన్స్ కి ఎక్కారు. ఈ ఇద్దరూ కులం వివక్ష అధికంగా ఉన్న రోజుల్లోనూ.. వాటి చుట్టూ ఉన్న కోటలు బద్ధలు కొట్టి మరీ బయట సమాజంలో హీరోలమని పించుకుని చరిత్రకెక్కారు. ఏది ఏమైనా వీరి ధైర్యానికీ సామాజిక సాహసానికీ హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేరెవ్వరూ.
.webp)