తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటివరకు ప్రమాద మరణాలకు మాత్రమే వర్తించే బీమా సౌకర్యాన్ని విస్తరించింది, ఇకపై సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.
యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న ఆర్టీసీ ఉద్యోగి సహజ మరణం చెందిన పక్షంలో, వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందజేయనుంది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు నుంచి. ముఖ్యంగా, ఈ బీమా కోసం ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం ప్రీమియాన్ని బ్యాంకే భరిస్తుంది.
ఇప్పటికే అమల్లో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా యథాతథంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు సహజ మరణ బీమా కూడా చేరడంతో ఉద్యోగుల భద్రత మరింత బలపడనుంది.
సంస్థ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు. ఈ చర్యతో సంస్థలో దాదాపు 38 వేల మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తూ, తమ కుటుంబాలకు ఇది పెద్ద రక్షణగా మారుతుందని.
