తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్‌లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి చేయబోతున్న సినిమా ‘కనక దుర్గ’ను ఇటీవల పూజ కార్య క్రమాలతో.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్. ఈ సినిమాలో నటుడు సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథ రూపొందించిన బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండగా ప్రదీప్ మద్దాలి నటిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి నిర్మాతలు.
భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకుల’కు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమార్‌పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ఈ రెండు సంస్థలకు ఎంతో ప్రత్యేకమైనది.
ఘనంగా జరిగిన విద్యా లాంచ్ ఈవెంట్‌లో చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెలతో పాటుగా అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకస్తూ, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, స్వప్నాదత్, సుప్నాదత్, రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు, వైఘా రెడ్డి, విరూప చిత్రంగా విచ్చేశారు.
సినిమా భావాన్ని ప్రతిబింబిస్తూ పూజా కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య స్త్రీ శక్తిని ప్రత్యేకంగా స్మరించుకున్నారు. హాజరైన మహిళలు కలిసి అమ్మవారి శక్తి, కరుణ, మహిమలను గౌరవించారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ “తమిళంలో మా ప్రయాణం ఎంతో ప్రోత్సాహకరంగా, విజయవంతంగా సాగింది. ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. భక్తి, సంస్కృతి, భావోద్వేగాల కలయికలతో ఈ సినిమా రూపొందుతోంది. అజిత్‌ఠాకూర్, బివిఎస్ మద్దాలితో కలిసి పన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్. రవి మాట్లాడుతూ “కనక దుర్గ కథ తెలుగు నేలకు సంబంధించిన ఆధ్యాత్మికత, సంస్కృతిలో బలంగా నాటుకుపోయింది. దీనితో మా ప్రయాణం ప్రారంభం కావటం ఎంతో ప్రత్యేకం. మా బ్యానర్‌లో రూపొందించిన తొలి తెలుగు సినిమా ఇది. అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈ చిత్రం రూపొందుతోంది.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ”కనక దుర్గ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆ అమ్మవారిపై నాకు ఉన్న భక్తి కూడా దీనికి కారణం. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ సినిమా అసలు కథ భక్తి గురించి మాత్రమే కాదు.. జీవితంలో ఒక మనిషి, తనకంటే గొప్ప శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది. మా కథను నమ్మి ‘అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్’ లాంటి సంస్థ ముందుకు రావడం, అలాగే ‘టెంపుల్ టౌన్ పిక్చర్స్’ ఈ ప్రాజెక్ట్‌ను ఇంత నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. విజువల్గా కూడా భారీ స్థాయిలో ఉంటే ఈ సినిమాతో మా ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది” అన్నారు.


