కడప జమ్మలమడుగులో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నదంటూనే.. జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెనుభూతంగా ఆయన జగన్ రెడ్డిని అభివర్ణించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజల చైతన్యవంతులు బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా నియోజకవర్గములో కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లింపు, రాజోలి జలాశయ నిర్మాణం, ఎస్ ఆర్ బి సి నిర్మాణం, ఆర్టిపిపి సమస్య పరిష్కారం కావాల్సి ఉంది.
గండికోట జలశయంలో ఇప్పటికే నీరు నిలువ చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్న ఆయన.. ఈ సమస్యల పరిష్కారం కాకుంటే.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
.webp)