Home Latest News వేసవి కదా అని ఈత కొట్టడానికి వెళ్తున్నారా? ఈ తప్పులు చేయకండి..! | సమ్మర్‌టైమ్ స్విమ్మింగ్ సేఫ్టీ కోసం చిట్కాలు | సమ్మర్ స్విమ్ అలర్ట్ మీరు తప్పక నివారించాల్సిన తప్పులు | ఈత భద్రతా చిట్కాలు | ఈ వేసవిలో ఈతకు వెళుతున్నాను ముందుగా దీన్ని చదవండి – Andhra Waves

వేసవి కదా అని ఈత కొట్టడానికి వెళ్తున్నారా? ఈ తప్పులు చేయకండి..! | సమ్మర్‌టైమ్ స్విమ్మింగ్ సేఫ్టీ కోసం చిట్కాలు | సమ్మర్ స్విమ్ అలర్ట్ మీరు తప్పక నివారించాల్సిన తప్పులు | ఈత భద్రతా చిట్కాలు | ఈ వేసవిలో ఈతకు వెళుతున్నాను ముందుగా దీన్ని చదవండి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం. అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు, చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా కంగారు పెట్టే సమస్య వస్తుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

స్విమ్మింగ్ ఫూల్ నీటిలోనిరిన్, రసాయనాలు, క్లోమం కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతుంది. జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి.

వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్ పెరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో వ్యాధి, వైరస్లు వృద్ధి చెందుతాయి. ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది.

స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్లు తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాత ఈత కొట్టాలి.

స్విమ్మింగ్ పూల్‌లో అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి. ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లగా, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి.

అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందులు వాడాలి. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది. స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird