ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 2) రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకున్నారు. ఇళ్ల ముందు దీపాలు వెలిగించి అమరావతికి దీపారాధన చేశారు.
కాగా అమరావతికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలం అయిన ఉద్దండరాయుని పాలెంలో జరిగిన సంబరాల్లో సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా ఉద్దండరాయుని పాలెం చేరుకున్న చంద్రబాబు అక్కడ రాజస్థానానికి శంకుస్థాపన చేశారు. దీప హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, రైతులు ఉన్నారు.


