Home సినిమా బైకర్ మూవీ రివ్యూ: బైకర్ మూవీ రివ్యూ – Andhra Waves

బైకర్ మూవీ రివ్యూ: బైకర్ మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


-సినిమా పేరు: బైకర్
-న’టీన’తులు: శర్వానంద్, డాక్టర్ రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి
-సినిమాటోగ్రఫీ: జే యువరాజ్
-ఎడిటింగ్: అనిల్ పసాల
-మ్యూజిక్: జిబ్రాన్
-నిర్మాతలు:వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్
-బ్యానర్: యువి క్రియేషన్స్
-రచన,దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
-రిలీజ్ తేదీ : ఏప్రిల్ 3 , 2026

నారీనారీ నడుమ మురారితో హిట్ మోడ్ లోకి వచ్చిన చార్మింగ్ స్టార్ ‘శర్వానంద్’ రోజు ‘బైకర్’ తో ఈ ల్యాండ్ ల్యాండ్ చేశాడు.శర్వా లుక్ తో పాటు ప్రచార చిత్రాలు బాగా అయ్యా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. మేకర్స్ ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
వికాస్ నారాయణ ఉరఫ్ విక్కీ( శర్వానంద్) యంగ్ అండ్ ఎనర్జిటిక్ తో కూడిన దూకుడు స్వభావం కలిగిన యువకుడు. చిన్న వయసు నుంచే బైక్ రేస్ లో ఇండియా తరుపున ఆడి ఛాంపియన్ గా నిలవాలనేది గోల్. ఒక రకంగా బైక్ రేస్ తనకి పంచప్రాణాలతో సమానం. తండ్రి సునీల్ నారాయణ(రాజశేఖర్) దగ్గర శిక్షణ తీసుకుంటాడు. తండ్రి అంటే సునీల్ కి ప్రాణం. ఎంతలా అంటే సునీల్ ని ఎవరైనా తిట్టినా చాలు వెనక ముందు చూసుకోకుండా కొడతాడు. సునీల్ నారాయణ కూడా యుక్త వయసులో బైక్ రేసర్. తాను సాధించలేనిది విక్కీ సాధించాలని అనుకుంటాడు.ఇంద్ర నీల్(అతుల్ కులకర్ణి) బడా బిజినెస్ మెన్ తో పాటు స్పోర్ట్స్ స్పాన్సర్. క్రికెట్ కి తప్ప ఇండియాలో రేసింగ్ కి ఆదరణ లేదనే చులకన భావంలో ఉంటాడు. అలాంటి వ్యక్తిని విక్కీకి స్పాన్సర్ గా ఉండటానికి సునీల్ నారాయణ ఒప్పిస్తాడు. కొన్ని కండిషన్స్ పై విక్కీ తరుపున అగ్రిమెంట్ పై సంతకం కూడా చేసింది. కానీ అనన్య(మాళవిక నాయర్) ని పెళ్లి చేసుకొని విక్కీ వెళ్ళిపోతాడు. బైక్ రైసింగ్ ప్రాణంగా బతికిన విక్కీ అనన్యతో హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ టైంలో సునీల్ నారాయణ పరిస్థితి ఏంటి? ఇంద్ర నీల్ కి హామీ ఇవ్వడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కున్నాడా? విక్కీ, సునీల్ విషయంలో ఇంద్రనీల్ ఏం చేసాడు? బైక్ రేసింగ్ అనగానే విక్కీకి శత్రువులు కూడా ఉంటారు కదా? వాళ్ల కథ ఏంటి? మరి చివరకి విక్కీ తన బైక్ రేస్ ఛాంపియన్ కలని నెరవేర్చుకొని తండ్రి కోరిక కూడా తీర్చాడా? లేదా అనేదే బైకర్

ఎనాలసిస్
బైకర్ అనే మోస్ట్ పవర్ ఫుల్ ఎనర్జీతో కూడిన టైటిల్ ని పెట్టుకొని ఫ్యామిలీ ఎమోషన్స్ ని హైలెట్ చెయ్యడం మైనస్ గా నిలిచింది. తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి బైకర్ లో చూపించిన ఫ్యామిలీ సన్నివేశాలు వస్తూనే ఉన్నాయి. బహుశా శర్వానంద్ కి కొత్త ఏమో గాని ప్రేక్షకులకి కాదు. పాజిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ గా, నెగిటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్ గా మారడం కూడా బైకర్ స్పెషల్. కానీ శర్వానంద్ తో వచ్చిన రేసింగ్ సీన్స్ మాత్రం సూపర్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే ఇదేదో తేడాగా ఉందే అని మన సినీ బుర్ర టక్కున పసిగడుతుంది. విక్కీ, కొడుకు ఇషాన్ మధ్య వచ్చిన సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

కొడుకు మాటలతో తన తండ్రి విలువని విక్కీ తెలుసుకోవడం అనే పాయింట్ బాగున్నా, సీన్స్ పరంగా వర్క్ అవుట్ కాలేదు. నువ్వు ఎంత త్వరగా ఆ విధంగా మాట్లాడితే నాకు మా నాన్న గుర్తొచ్చి కథ ముందుకు నడుస్తుందని విక్కీ అలాగే ఉంది. విక్కీ, అనన్య మధ్య వచ్చిన సీన్స్ తో పాటు తమిళనాడులో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అయితే ఒక లెవల్. అసలు సినిమా చూస్తున్నంత సేపు రేసింగ్ కోసం మూవీ తెరకెక్కించారని అనిపిస్తుంది. మాళవిక, విక్కీ లవ్ సీన్స్ పర్లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే ప్రారంభం నుంచి ఫాస్ట్ గా సాగుతుందని అనిపించినా రొటీన్ సీన్స్ తో నింపేశారు. అసలు విక్కీ, అనన్య సీన్స్ అయితే మరి దారుణం. ఆల్రెడీ ఈ రెండు క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్ లో హ్యాపీగా ఏడేళ్ల కొడుకు ఇషాన్ తో కలిసి ఉంటున్నట్టుగా చూపించారు.

అలాంటిది రేసింగ్ పోటీలో ఉన్న విక్కీ మధ్య ప్రెగ్నెంట్ గా ఉన్న అనన్య డెలివరీకి ఇబ్బంది పడుతుండటం మధ్య టెన్షన్ ఎస్టాబ్లిష్ చేసారు. ఈ ఒక్క సీన్ తో అర్ధం చేసుకోవచ్చు. మేకర్స్ స్క్రీన్ ప్లే విషయంలో ఎంత అవగాహన రాహిత్యంగా ప్రవర్తించారో. ఆట అంటే ప్రాణం ఉన్న వ్యక్తి ఒకే ఒక్క మాటకి కూడా వదిలి వెళ్లిపోడు కదా. విక్కీ మళ్ళీ రేస్ లో గెలవాలని తండ్రి దగ్గరకి రావడం, కానీ మళ్ళీ వెళ్లిపోవాలనే ఆలోచనతో ఉంటున్న టైంలో కొడుకు రావడం ఇలా రకరకాల సీన్స్ తో అర్ధం పర్థం లేకుండా నింపేశారు. క్లైమాక్స్ పర్లేదు అనే స్థాయిలో ఉన్నా బైక్ రేసింగ్ పోటీలకి సంబంధించిన పర్మిషన్స్ విషయంలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసారు.


నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
విక్కీగా శర్వానంద్ పెర్ ఫార్మ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లవర్ బాయ్ గా, తండ్రిని ప్రేమించే కొడుకుగా, కొడుకుని ప్రేమించే తండ్రిగా, రేసర్ గా ఇలా పలు పార్శ్యాలు ఉన్న క్యారెక్టర్స్ లో ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసాడు. కానీ స్క్రిప్ట్ లోని లోపాల వల్ల అవన్నీ మరుగున పడే అవకాశం ఉంది. అనన్యగా మాళవిక సెటిల్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించి మేకర్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని న్యాయం చేసింది. రాజశేఖర్ గారైతే యాంగ్రీ యంగ్ మెన్ అనే టాగ్ లైన్ ఎప్పటికి నాదే సుమీ.. మర్చిపోవద్దు అనేలా మెస్మరైజ్ చేసి పడేసాడు. రాజశేఖర్ గారు ఇలాగే కంటిన్యూ అయితే ప్రేక్షకులతో పాటు సిల్వర్ స్క్రీన్ అదృష్టం చేసుకున్నట్టే. మిగతా వాళ్ల పెర్ఫార్మ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేకపోయినా ఇంద్ర నీల్ గా చేసిన అతుల్ కులకర్ణి, విక్కీ అంటే గిట్టని బైకర్ అన్వర్, బ్రహ్మాజీ తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు బాగా చేసారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం చాలా స్టైలిస్ట్ గా సూపర్ గా ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో చాలా తప్పులు చేసాడు.తప్పులు చేసాడనే కంటే బైకర్ కి అన్యాయం చేసాడని చెప్పవచ్చు. యువి నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,యువరాజ్ ఫొటోగ్రఫీ అన్నిటికంటే అతి పెద్ద ప్లస్

చివరిగా చెప్పాలంటే బైకర్ అనే టైటిల్ కి తగ్గట్టే రేసింగ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. మిగిలినదంతా పాత చింతకాయ పచ్చడి


బలాలు
1 . శర్వానంద్, రాజశేఖర్ పెర్ ఫార్మెన్స్
2 . రేసింగ్ సన్నివేశాలు
మూడు. ఫోటోగ్రఫీ
4 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్


బలహీనతలు
1 .ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వీక్ గా నడిచే కధనం
2 .విక్కీ క్యారక్టర్ లో ఉన్న కన్ఫ్యూజ్
3 . కథ
4 .ఫ్యామిలీ సన్నివేశాలు
5 . ప్రీ క్లైమాక్స్
6 .క్లైమాక్స్

రేటింగ్ 2 .5/5

అరుణాచలం

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird