మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై ఇరాన్ దాడి చేసింది. ముందుగా చెప్పి మరీ చేసిన దాడిగా దీనిని అభివర్ణించవచ్చు. ఎందుకంటే..అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము పశ్చిమాసియాలో దిగ్గజ కంపెనీలపై దాడులకు తెగబడతామని ఇరాన్ హెచ్చరించిన 24 గంటల వ్యవధిలో ఈ దాడి జరిగింది. రాయిటర్స్ కథనం ప్రకారం దాడి తరువాత అమెజాన్ కంపెనీ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి.
అయితే వాటిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలో అమెజాన్, యాపిల్, టెస్లా వంటి అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ దాడి జరగడం జరిగింది. ఈ ఘటనపై అమెజాన్ అధికారికంగా స్పందించలేదు.
అయితే ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల కారణంగా తమ అమెజాన్ వెబ్ సర్వీకి అంతరాయం కలిగిందని కంపెనీ అంగీకరించింది. వాణిజ్యపరమైన డేటా సెంటర్‌పై ఒక దేశం నేరుగా భౌతిక దాడికిటం ఇదే మొదటిసారి.
