ఆత్మప్రభోదానుసారం ఓటింగ్ అంటూ సాధారణంగా రాజకీయాలలో వింటుంటాం. అది కూడా అన్ని రకాలుగా ఆలోచించి జరిగే ఓటింగ్ అది. కానీ అద్భుతమైన జీతం, విలాసవంతమైన జీవితం, సమాజంలో గుర్తింపు ఉన్న ఉద్యోగాన్ని ఆత్మప్రభోదానుసారం వదిలేసుకుంటున్నాను అంటే చాలా అరుదుగా ఉంటారు. బెంగళూరుకు చెందిన హర్షిత్ శర్మ అనే ఉద్యోగి ఎంత జీతం ఉంటే మాత్రం మనసు అంగీకరించినప్పుడు చేయడమెందుకు? అంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
అది కూడా అలాంటి సంస్థలో ఉద్యోగం కాదు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో ఉన్నతోద్యోగాన్ని ఆత్మ ప్రబోధాను సారం అంటూ తృణ ప్రాయంగా వదిలేశాడు. సాధారణంగా గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడం అనేది యువతకు ఒక కల. భారీ ప్యాకేజీలు, సమాజంలో గుర్తింపు.. ఉంటే అలాంటి ఉద్యోగాన్ని వదులు కోవడానికి సాధారణంగా ఎవరైనా వెనుకబడతారు. హర్షిత్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ గూగుల్ లో చేస్తున్న సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగానికి ముగింపు పలికాడు.
ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ముందు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ..హర్షిత్ శర్మ పోస్టు చేసిన వీడియోలో ఏమన్నాడంటే.. ఇన్నాళ్లూ తానొక రోబోలా బతికానన్నాడు. టెన్త్ కంప్లీట్ చేసిన తరువాత సైన్స్ తీసుకోవడం, జేఈఈ రాసి ఇంజనీరింగ్‌లో చేరడం, ఆపై ఐటీ ఉద్యోగం సంపాదించడం.. ఇదంతా కేవలం ఇతరుల అంచనాలు అందుకోవడం కోసమే జరిగిందనీ, తన ఆసక్తి ఇసుమంతైనా ఉందా లేదా అన్నది తెలియడం లేదని హర్షిత్.
ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే.. తన లైఫ్ అంతా గీసిన గీత దాటని ఒక లైన్ ఫాలోయింగ్ రోబోలో గడిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు గూగుల్ ఉద్యోగంలో ఉన్నది ఏదో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఎంత కాదనీ, గత కొన్నేళ్లుగా తాను సంపాదించిన సొమ్ములో అధికభాగం పొదుపు చేసి.. మూడు నాలుగేళ్లలో ఎటువంటి ఆదాయం లేకపోయినా కుటుంబ అవసరాలకు ఎటువంటి ఢోకా లేదన్న ధీమా వచ్చిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇహ తనకు ఇష్టమైన రంగంలో ముందుకు సాగేందుకు తన పొదుపు ధీమా ఇచ్చింది.
ప్రస్తుతానికి రొటీన్ పనులు కాకుండా, ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్న హాబీలు మరియు ఆశయాలను నెరవేర్చుకుంటానని ఆ వీడియోలో హర్షం వ్యక్తం చేశారు. 2027 నాటికి తన నిర్ణయం సరైనదే అని గర్వంగా చెప్పుకునేలా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇక నెటిజనులైతే హర్షిత్ వ్యక్తిత్వాన్నీ, ధైర్యాన్ని వేనోళ్ల పొడుగుతున్నారు. వాతావరణ ఒత్తిడిలో బతుకుతున్న ఎందరికో హర్షిత్ స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు.
