Home Latest News ‘మూడు’ను పట్టుకు వేళాడుతున్న జగన్ రెడ్డి! | ముగ్గురిపై జగన్ క్రేజ్ | ఆంధ్ర ప్రదేశ్ | రాజధాని – Andhra Waves

‘మూడు’ను పట్టుకు వేళాడుతున్న జగన్ రెడ్డి! | ముగ్గురిపై జగన్ క్రేజ్ | ఆంధ్ర ప్రదేశ్ | రాజధాని – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


వైసీసీ అధినేత జగన్ రెడ్డి ‘మూడు’ పంతం పట్టారా? అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారమే కాదు, కనీసం విపక్ష నేత గుర్తింపు కూడా లేకుండా పోయినప్పుడూ కదా ఆయన మూడ్ మూడు మీదే ఉంది. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టినప్పుడు గతంలో తాను అమరావతికి అసెంబ్లీ వేదికగా సంపూర్ణ మద్దతు ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి మరీ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు. సరే ఆ ఆటలో ఎంత ఘోరంగా పరాజయం పాలయ్యారో 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తేల్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తున్న వేళ ఆయన మరో ‘మూడు’ తో ముందుకు వచ్చారు.

సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు. అది పక్కన పెడితే అప్పట్లో మూడు రాజధానులను జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం సరిగ్గా అడ్డుకుంది.

దాంతో మూడు రాజధానులకు చట్టబద్ధత పక్కన పెట్టేసి తన ఇష్టం కనుక మూడు రాజధానులు అనే మూడుముక్కలాటతోనే ఐదేళ్లూ గడిపేశారు. 2024లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన చందంగా వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇక తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిని పట్టాలెక్కించింది. ఓ వైపు పనుల వేగాన్ని పెంచుతూనే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగుల వేగం పెంచింది. అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని అసెంబ్లీలో ఓ తీర్మానం కోరింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం ఉంది.

అయితే ఊరంతటిదీ ఒకదారి.. ఉలిపికట్టెదొక దారి అన్న చంద్రంగా పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలోనే జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో సారి మూడు రాజధానుల మాట ఎత్తారు. అయితే ఈ సారి అమరావతి, కర్నూలు, విశాఖ అని కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా రూపొందిస్తున్నారు.

జగన్ ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ‘మూడు’ను పట్టుకుని వేళాడుతున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి అంటే.. దానికి ఆనుకుని ఉన్న మచిలీపట్నం,గుంటూరు, విజయవాడలు వాటంతటవే ఆటోమేటిగ్గా అభివృద్ధి చెందుతాయనడంలో ఇసుమంతైనా అనుమానాలకు ఆస్కారమే లేదు. అయితే జగన్ మాత్రం మూడు మూడంటూనే మచిలీపట్నం, విజయవాడ,గుంటూరుల అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird