Home సినిమా స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా హల్ చల్.. వైరల్ అవుతున్న పిక్స్ – Andhra Waves

స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా హల్ చల్.. వైరల్ అవుతున్న పిక్స్ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo



-వారణాసితో ప్రియాంక చోప్రా బిజీ
-నిన్న స్వర్ణ దేవాలయం సందర్శన
-వైరల్ అవుతున్న పిక్స్

మహేష్ బాబు(మహేష్బాబు),రాజమౌళి(ss రాజమౌళి)వరల్డ్ మేకర్స్ తెలుగు సినిమా వైపు చూసేలా ‘వారణాసి'(వారణాసి)ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఆ విషయంలో నేను కూడా హామీ అంటూ మందాకినీగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనుంది. ఈ ముగ్గురుతో పాటు మిగిలిన టెక్నీషియన్స్ కి విషయం ఏంటంటే పాప కర్మలని పటాపంచలు చేయడానికి పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్న మన భారతదేశపు చిట్టచివరి నగరం వారణాసిని ప్రతి ఒక్కరు తలుచుకునేలా చేయడం. ఈ విధంగా వారణాసి టీం ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రియాంక చోప్రా(ప్రియాంక చోప్రా)గురించి వస్తున్న న్యూస్ నే అందుకు సాక్ష్యం. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ప్రియాంక చోప్రా నిన్న అమృత్‌సర్‌లోని సిక్కుల పవిత్ర క్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. సాంప్రదాయ బద్ధంగా గులాబీ రంగు డ్రస్ ధరించి, తలపై చున్నీ వేసుకుని ఆలయ మర్యాదలని పాటించడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని లంగర్ (ఉచిత అన్నదాన కేంద్రం) లో అన్నం వడ్డించడంతో పాటు స్వయంగా ఆ పాత్రలని శుభ్రం చేసింది. ఈ విధంగా అందరితో కలిసి కూర్చున్న గంటల తరబడి సేవలో నిమగ్నమవ్వడం చూసి అక్కడి భక్తులు ప్రియాంక సింప్లి సిటీని మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ కావడంతో నెటిజన్స్ ప్రియాంకని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు

ఇది కూడా చదవండి: సమంత: సమంతపై సుకుమార్ వ్యాఖ్యలు.. నా చెంప చెళ్లుమనిపించినట్లు అయ్యింది

‘వారణాసి’ ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని పలు ఏరియాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అందులో భాగంగానే ప్రియాంక అమృత్‌సర్ ని సందర్శించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird